జనసేన అధినేత పవన్‌కళ్యాణ్..గత కొన్ని రోజులుగా ట్విట్టర్‌లో తన పార్టీ ప్రశ్నించడానికే అన్నట్లుగా కొన్ని సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. ముఖ్యంగా పవన్ చేస్తున్న ట్విట్‌లు..బిజెపి ప్రభుత్వలోపాలను ఎత్తిచూపేవిగా ఉండటంతో..బిజెపి నాయకులు కూడా పవన్‌ని ప్రతిఘటించలేకపోతున్నారు. ముందు పూర్తి రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత మాట్లాడమనండి అని తప్పుకుంటున్నారు..తప్ప..పవన్ ప్రశ్నిస్తున్న విషయాలపై స్పందించడానికి వారు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పవన్ మాత్రం వరుసగా ఒక్కొక్క బాణాన్ని ఎక్కుపెడుతూనే ఉన్నాడు. గోవధ, రోహిత్ వేముల ఆత్మహత్య, సినిమా ధియేటర్‌లలో జాతీయగీతం, ప్రత్యేకహోదా..ఇలా ప్రతి విషయంలోనూ బిజెపి లోపాలను వేలెత్తి చూపిన పవన్..తన ప్రశ్నిస్తానన్న ఐదవ ప్రశ్న విషయంలో మాత్రం సైడ్ ట్రాక్ పట్టాడు.
పెద్ద నోట్ల రద్దు గురించి స్పందించిన పవన్..ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కాకుండా ఆర్పీఐ గవర్నర్ ఉర్జీత్ పటేలే అంతా చేశాడు అన్నట్లుగా పవన్ స్పందించాడు. మొదటి నుండి బిజెపికి, మోడీకి చాలా సన్నిహిత సంబంధాలు కలిగిన పవన్..అసలు కారకుడైన మోడీని కాదని ఉర్జీత్ పటేల్‌ని ఎందుకు టార్గెట్ చేసినట్లు? నవంబర్ 8న నోట్స్ బ్యాన్ అనే నిర్ణయం వచ్చినప్పటి నుండి..దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ నేనే అని చెప్పుకుంటున్న మోడీని వదిలేసి..ఉర్జీత్‌పై ఎందుకు ఆరోపణలు చేసినట్లు. మోడీ పేరు చెప్పడానికి పవన్ భయపడ్డాడా..? లేక డబ్బులకు సంబంధించిన విషయం కాబట్టి..ముందు ఆర్బీఐ నుండి మొదలెడితే..చేరాల్సిన వారికి చేరుతుందని పవన్ అలా ఆలోచించాడా..? ఏదీఏమైనా..పవన్ ప్రశ్నలైతే కనిపిస్తున్నాయి..కానీ..వాటికి సమాధానం మాత్రం ఇప్పటి వరకు ఏ రూపంలోనూ రాలేదు..వస్తుందో లేదో చెప్పడం కూడా కష్టం అంటున్నారు కొందరు మేధావులు.