సహజంగా ఆడియో ఫంక్షన్‌లకు వచ్చిన గెస్ట్‌లతో యాంకర్ సుమ ఏవిధంగా ఆడుకుంటుందో అందరికీ తెలిసిన విషయమే. అటుది ఇటు, ఇటుది అటు చేసి..సమయస్ఫూర్తిగా సమాధానాలు ఇస్తూ..టాప్ యాంకర్‌గా సుమ తన స్థాయిని రోజురోజుకు పెంచుకుంటుంది. అయితే రీసెంట్‌గా జరిగిన ఓ ఆడియో వేడుకలో సుమకి గట్టి కౌంటర్ ఇచ్చాడు ఓ యంగ్ హీరో. ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరనుకుంటున్నారు..? ఇంకెవరు రాజ్ తరుణ్.
శతమానం భవతి చిత్ర ఆడియో వేడుక సాక్షిగా సుమకి గట్టి కౌంటర్ వేశాడు రాజ్ తరుణ్. విషయంలోకి వస్తే..టైటిల్‌కి తగినట్లుగా ఆడియో వేడుకకి వచ్చిన గెస్ట్ లందరినీ మీ పెళ్లి ఎప్పుడు అంటూ సుమ తనదైన స్టయిల్‌లో ప్రశ్నించింది. 'నీకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందా..? అని రాజ్ తరుణ్ ను ప్రశ్నించిన సుమకు వెంటనే 'మీకు పెళ్లి కాకుండా ఉంటే ఆ ఆలోచన ఉండేది..ఇప్పుడు పెళ్లి ఆలోచన లేదు..' అంటూ షాకింగ్ సమాధానమిచ్చాడు రాజ్‌తరుణ్. రాజ్ తరుణ్ ఇచ్చిన ఈ ఆన్సర్‌తో సుమ తేరుకోవడానికి కాస్త టైమ్ కూడా తీసుకుంది. ఇంక చేసేది లేక..తనపై పడిన పంచ్‌ని సరిచేసుకునే విధంగా..'హ్యాపీ మ్యారీడ్ లైఫ్' అంటూ అతని దగ్గర నుండి జారుకుంది.