Advertisementt

స్టైల్ మార్చాడండోయ్...!

Thu 22nd Dec 2016 12:35 PM
kollywood fans,ajith kumar,tamil nadu film actor ajith kumar,ajith 57 movie,heroines kajal,akshara haasan,this movie released on 25th april 2017  స్టైల్ మార్చాడండోయ్...!
స్టైల్ మార్చాడండోయ్...!
Advertisement
Ads by CJ

అజిత్ కు కోలీవుడ్ లో అభిమానుల సంఖ్య మిగతా స్టార్స్ తో పోలిస్తే కొంచెం ఎక్కువనే చెప్పాలి. ఇక తెలుగులో కూడా అజిత్ కు వీరాభిమానులు వున్నారు. అయితే అజిత్ కొన్నాళ్ల నుండి తన వయసుకు తగిన పాత్రలు చెయ్యడానికే మొగ్గు చూపుతున్నాడు. ఇక తన వయసుకు తగ్గ గెటప్స్ మాత్రమే వేస్తూ అసలు కొత్తదనమనేదే లేకుండా గడిపేస్తున్నాడు. అయితే అజిత్ ఒక్కసారి ఫ్యాషనబుల్ గా కనబడితే బావుండు అని చాలామంది అభిమానులు ఎప్పటినుండో తెగ ఎదురు చూస్తున్నారు. అయితే అభిమానుల కోరికని ఇప్పుడు అజిత్ తీర్చేలాగే కనబడుతున్నాడు.

అజిత్ తన 57  వ చిత్రంలో కొంచెం డిఫరెంట్ లుక్ లో కొత్తగా కనబడాలని డిసైడ్ అయ్యాడని అంటున్నారు. కొంచెం స్టైలిష్ గా కనబడడానికి ప్రయత్నిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక ఫోటోని చూస్తే అర్ధమవుతుంది. శివ దర్శకత్వంలో అజిత్ 57వ చిత్రంలో ఇంత స్టైలిష్ గా కనబడతాడు అని ఒక ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ పిక్ లో అజిత్ తన ఏజ్ గెటప్ కి పూర్తి విరుద్ధంగా పూర్తిగా కుర్రాడు మాదిరిగా దర్శనమిస్తున్నాడు. టైట్ షర్ట్, జీన్స్ ఫ్యాన్ట్, మాంచి ఫిజిక్ ఉన్నబాడీ తో కొత్తగా కనబడుతున్నాడు. 

ఇక ఈ ఫోటోని చూసిన అజిత్ ఫ్యాన్స్ కి మైండ్ బ్లాంక్ అయిపోయి ఖుషి ఖుషీగా వున్నారు.  అజిత్ 57వ చిత్రానికి సంబందించిన ఫోటో గాని పోస్టర్ గానీ బయటికి వస్తే అది విపరీతమైన సంచలనంగా మారిపోతుంది. ఇక ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, అక్షర హాసన్ లు అజిత్ సరసన హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 27న విడుడల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ