భారత దేశం మొత్తం డబ్బులు కోసం క్యూలైన్ లో నిలబడి.... ఏటీఎంల వద్ద, బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతూ.. నిత్యావసర వస్తువుల కోసం, ఇంటి అద్దెల కోసం కష్టపడుతున్న సమయం లో నిఖిల్ తన సినిమా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ని ధైర్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. చాలామంది నిఖిల్ రాంగ్ టైమ్ లో సినిమాని విడుదల చేస్తున్నాడని మొత్తుకున్నా కూడా లెక్క చెయ్యకుండా సినిమాని విడుదల చేసిపారేసాడు. ఇక సినిమా విడుదలైన దగ్గర నుండి పాజిటివ్ టాక్ తో రన్ అవుతూ థియేటర్స్ దుమ్ము దులిపేస్తుంది. కలక్షన్స్ పరంగా పెద్ద హీరోల సినిమాలతో పోటీపడి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది.
అసలు ఒక సినిమాకి పబ్లిసిటీ చేసినా చెయ్యక పోయినా కూడా సినిమలో దమ్ము ఉంటే ఆ సినిమా కలెక్షన్స్ కి ఎవరూ అడ్డుకట్ట వెయ్యలేరని 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రం నిరూపించింది. అసలే గడ్డు కాలం, ప్రేక్షకుల చేతిలో చిల్లి గవ్వ లేని టైమ్ లో నిఖిల్ ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఆశ్చర్యపరిచినప్పటికీ ఈ చిత్ర విజయంతో ఇప్పుడు ఫుల్ ఖుషీలో వున్నారు ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్ర టీమ్ మొత్తం. ఐవీ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కథకి బలమైన చోటు ఉండడం... పాసిటివ్ టాక్, నిఖిల్ నటన, నందిత శ్వేతా నటనతోనే ఈ చిత్రం 30 రోజుల వ్యవధిలోనే దాదాపు ముప్పై ఎనిమిది కోట్లు వసూలు చేసి అందరికి దిమ్మతిరిగేలా చేసింది.
ఇక ఓవర్ సీస్ లో కూడా 'ఎక్కడికి పోతావ్ చిన్నవాడా' స్ట్రాంగ్ మార్కెట్ క్రియేట్ చేసి విజయం దిశగా దూసుకుపోతుంది. ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా సూపర్ హిట్ అయ్యి, సూపర్ సక్సెస్ ని సాధించి నిఖిల్ ని మళ్లీ హిట్ హీరోగా నిలబెట్టింది. ఇప్పటికే 'స్వామి రా... రా' సినిమా దగ్గర నుండి డిఫ్రెంట్ స్టోరీలను ఎంచుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న నిఖిల్ కి ఈ 'ఎక్కడికి పోతావ్ చిన్నవాడా' కూడా మంచి హిట్ ని అందించింది.