Advertisementt

శశికళ ఎవరు అంటోన్న సెల్వం..!

Wed 21st Dec 2016 05:12 PM
  శశికళ ఎవరు అంటోన్న సెల్వం..!
శశికళ ఎవరు అంటోన్న సెల్వం..!
Advertisement
Ads by CJ

తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణించిన తర్వాత తమిళనాట రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి సీటుపై కుమ్మలాట మొదలైనట్లుగానే తెలుస్తుంది. ఆ మధ్య జయలలిత నెచ్చెలి శశికళ అడుగు జాడల్లోనే నడుచుకుంటానని అంటూ వచ్చిన పన్నీర్ సెల్వం తాజాగా రూటు మారుస్తున్నాడు. ఏ విధంగానైనా సరే తన ముఖ్యమంత్రి సీటుకు శశికళ ఎసరు పెడుతుందేమోనని గుర్తించిన పెన్నీరు సెల్వం ముందుగానే పెద్దల అండతో కాపాడుకొనే పడ్డాడు. అందుకనే ఈ మధ్య పన్నీరు సెల్వం ప్రధాని మోడీని కూడా కలిశాడని, సెల్వం ప్రధానిని కలిసొచ్చాక ఇక  పన్నీరు నోటి వెంట శశికళ అని ఉచ్చరించడానికి కూడా మనస్కరించడం లేదని తెలుస్తుంది. ఒకవేళ పార్టీలో ఎవరైనా పన్నీరు సెల్వం వద్ద శశికళ ప్రస్తావన తీసుకువస్తే.. ఒక్క ఉరుం ఉరిమి చూసి ఆమె ఎవరు కొత్తగా అన్నట్లు చూస్తున్నాడని అన్నా డీఎంకే పార్టీ వర్గాల్లో బాగా టాక్ నడుస్తుంది. దీంతో తమిళనాట రాజకీయాలు మెల్లి మెల్లిగా వేడెక్కుతున్నాయనే చెప్పాలి. 

మొదట్లో పెన్నీరు సెల్వం శశికళ వెంటనే తిరిగి ఆమె వద్దకే వెళ్ళి మరీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీరే ఉండాలంటూ కోరి ఆ పదవిలో కూర్చోపెట్టాడు. అయితే తాజాగా ఇటువంటి పరిణామాలు చోటుచేసుకోవడంతో రోజు రోజుకూ తమిళనాడులో రాజకీయాలు మారిపోతున్నాయి. అయితే పార్టీలోని చాలా మంది నేతలు చిన్నమ్మ అయిన శశికళనే సపోర్టు చేస్తుండటంతో తమిళ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. పన్నీరు సెల్వం ప్రధానిని కలిసి జయలలితకు భారత కావాలని కోరానని పైకి వెళ్ళడించినా మోడితో సెల్వం మీట్ మాత్రం ముమ్మాటికీ రాజకీయాలతో ముడిపడే జరిగిందని రాజకీయ నేతల్లో తీవ్ర చర్చోపచర్చలు వస్తున్నాయి. అయితే పన్నీరు సెల్వం ప్రధానిని కలిసిన బయటకు వచ్చిన తర్వాత మీడియా ఆయన్ను శశికళా నటరాజన్ గురించి గుచ్చి గుచ్చి అడిగినా.. ఏ మాత్రం స్పందించకుండా వెళ్లిపోయాడు. దీంతో తమిళనాడులో రాజకీయాలు మళ్లీ ఊపందుకున్నాయని, అదే విషయం చర్చోపచర్చలకు దారితీస్తుందని విశ్లేషకుల అభిప్రాయం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ