2016 లో బడా సినిమాలతో పాటు చాలా చిన్న సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ సాధించాయి. పెద్ద హీరో లైన పవన్, మహేష్ నటించిన సినిమాలు ఘోరమైన ప్లాపులు మూటగట్టుకోగా... అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక చిన్న సినిమాలు కొన్ని పెద్ద సినిమాల కన్నా బిగ్గెస్ట్ హిట్ అయ్యి స్టార్ హీరోలకు షాక్ ఇచ్చాయి. పవన్ సర్దార్, మహేష్ బ్రహ్మోత్సవం సినిమాలు ఈ సంవత్సర అతి పెద్ద ప్లాపులుగా నిలవగా.... నితిన్, సమంత జంటగా నటించిన 'అ... ఆ' సినిమా బిగ్గెస్ట్ హిట్ అయ్యి కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ ని దున్నేసింది. ఈ 'అ...ఆ' చిత్రం చిన్న సినిమాగా విడుదలై రెండు తెలుగు రాష్ట్రాల్లో మరియు ఓవర్సీస్ లో సత్తా చాటింది. ఈ సినిమాతో నితిన్ టాప్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. ఈ చిత్రాన్ని మాటల మంత్రుకుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా సమంత ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఫ్యామిలీ మెచ్చిన చిత్రంగా ఈ 'అ... ఆ' చిత్రం కలెక్షన్స్ వర్షం కురిపించింది.
ఇక చిన్న సినిమాగ విడుదలైన పెళ్లి చూపులు చిత్రంకూడా మంచి కలెక్షన్స్ సాధించింది. అయితే పెద్ద హీరోలు అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ చిత్రాలు కూడా కలెక్ట్ చెయ్యని కలెక్షన్స్ ని అ... ఆ సినిమా సాధించిందని చెబుతున్నారు. ఇక ఈ అ... ఆ చిత్రం ఓవర్సీస్‌లో $2.45 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. ఇక 2016 లో ఓవర్సీస్ లో 2 మిలియన్ మార్కుని చేరుకున్న మొట్టమొదటి తెలుగు చిత్రంగా అ... ఆ చిత్రం నిలిచి మిగతా హీరోలకు వెన్నులో ఒణుకు పుట్టించింది. అయితే ఈ ఏడాది ఎంతమంది స్టార్ హీరోలు తమ సినిమాలు విడుదల చేసినా నితిన్ నటించిన అ... ఆ సినిమా కలెక్షన్స్ ని చేరుకోలేకపోయాయి.
ఇక 2016 లో ఓవర్సీస్‌లో తెలుగు సినిమాల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో మీరు ఓ లుక్కేయండి.
1 అ..ఆ $2.45 మిలియన్ డాలర్లు
2. నాన్నకు ప్రేమతో $2.02 మిలియన్ డాలర్లు
3. జనతా గ్యారేజ్ $1.80 మిలియన్ డాలర్లు
4. ఊపిరి ,$1.57 మిలియన్ డాలర్లు
5. పెళ్లి చూపులు $1.22 మిలియన్ డాలర్లు
6.బ్రహ్మోత్సవం $1.16 మిలియన్ డాలర్లు
7.సర్దార్ గబ్బర్ సింగ్ $1.07 మిలియన్ డాలర్లు
8. ధృవ $1.05 మిలియన్ డాలర్లు