సినిమా ఇండస్ట్రీ లో చిన్న వయసులోనే తెర మీద కనబడి తమ నటనతో అభిమానులను సంపాదించుకోవడమే కాదు రెండుచేతులా సంపాదిస్తూ క్షణం తీరిక లేకుండా బిజీ లైఫ్ ని గడుపుతున్నారు చాలామంది తారలు. చైల్డ్ ఆర్టిస్ట్ లుగా ఇండస్ట్రీ లోకొచ్చి క్రమంగా పెద్దవాళ్ళయ్యాకా కూడా నటనని వదలకుండా అలాగే సెటిల్ అయిపోతున్నారు. ఇక వీరు తమ తల్లి తండ్రుల సంరక్షణలోనే సినిమా షూటింగ్స్ కి హాజరవుతూ.... తాము సంపాదించిన మొత్తం సొమ్ముపై వారి తల్లితండ్రుల పెత్తనమే ఉంచుతున్నారు. అయితే వీరు ఎంతో కష్టపడి ఒక స్థాయికి చేరుకున్నాక కూడా తాము ఇంకా యంత్రాల్లా పని చెయ్యలేక విసుగు చెంది ఒక గట్టి నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఇక మానసిక ఒత్తిడివల్ల కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నవారు లేకపోలేదు. ఈ తతంగమంతా అనాదిగా చూస్తున్నదే. ఒక పక్క మానసిక వత్తిడి మరోపక్క తల్లితండ్రుల ప్రెషర్ వల్ల ఆనాటి తరం హీరోయిన్స్ నుండి ఇప్పటి తరం హీరోయిన్స్ వరకు ఒకే రీతిలో వారి బాధకు కారణమవుతున్నాయి
అసలు ఇప్పుడు ఇదంతా చెప్పుకోవడానికి ఒక కారణం వుంది.. అదేమిటంటే 'మా' టీవీ లో వచ్చే చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ అవికా గోర్ గుర్తుండే ఉంటుంది. ఆమె ఆ సీరియల్ లో ఆడుతూ పాడుతూ కలివిడి గల అమ్మాయిగా అందరికి సుపరిచయమే. అవికా చిన్నప్పటినుండి బుల్లితెర మీద బాగా బిజీగా ఉండేది. ఆమెకు బుల్లితెర నుండి టాలీవుడ్ లో 'ఉయ్యాలా జంపాల' చిత్రంలో కూడా అతి చిన్న వయసులో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. అప్పటికి ఆమె వయసు కేవలం 15 ఏళ్ళు మాత్రమే. ఇక ఇటు టాలీవుడ్ లో నటిస్తూనే బాలీవుడ్ లో సీరియల్స్ చేస్తూ ఒక్క క్షణం తీరిక లేకుండా హైదరాబాద్ నుండి ముంబై ట్రావెల్ చేస్తూ బిజీ బిజీ గా మారిపోయింది అవికా లైఫ్. ఇక తర్వాత తెలుగులో మంచి అవకాశాలు వచ్చి ఆమె మరిన్ని సినిమాల్లో కనిపించింది.
అయితే ఈ మధ్యన అవికా అసలు పెద్దగా కనబడడం లేదు. కారణం ఆమె తన తల్లి తండ్రుల ఒత్తిళ్లకు తలొగ్గి తీరిక లేని జీవితాన్ని గడుపుతూ బాగా ఒత్తిడికి లోనవ్వడం వల్ల కొన్ని రోజులు విశ్రాంతి కోసం ఆమె షూటింగ్స్ కి గుడ్ బై చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. కేవలం తన తల్లితండ్రులు తనని ఒక మిషన్ లాగ ట్రీట్ చెయ్యడం వల్ల బాగా విసిగిపోయిన అవికా ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇక అందులోను అవికా ఇప్పుడు మేజర్ (19) అవ్వడంతో మనీ మెషిన్‌లా చూసిన తల్లిదండ్రులను కూడా వదిలేసి ముంబై లో ప్రశాంత జీవితాన్ని గడపాలని అనుకుందని చెబుతున్నారు. కొన్నాళ్ళు ప్రశాంతం గా గడిపాక మళ్ళీ కెరీర్ మీద దృష్టి పెట్టాలని అవికా భావిస్తోందట.