పవన్ కళ్యాణ్ త్వర త్వరగా సినిమాలను లైన్ లో పెట్టి ఆ సినిమా షూటింగ్స్ ని కూడా ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుని 2019 ఎన్నికల నాటికీ ఖాళీగా రాజకీయాల్లో బిజీ కావాలనుకుంటున్నాడు. అందుకే విరామం లేకుండా 'కాటమరాయుడు' షూటింగ్ ని స్పీడుగా కానిచ్చేస్తున్నాడు. మరో వైపు ఏ. ఎం. రత్నం - నీసన్ కాంబినేషన్‌లో ఒక సినిమాకి పూజ కార్యక్రమాలు జరుపుకుని షూటింగ్ కి సిద్ధమయ్యాడు. తమిళంలో హిట్ అయిన అజిత్ 'వేదలమ్' చిత్రానికి రీమేక్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
అయితే ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ చెల్లెలిగా 'జెంటిల్మన్' ఫేమ్ నివేదా థామస్ నటించనుందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే 'జెంటిల్మన్' తర్వాత ఇప్పటివరకు తెలుగులో మరే సినిమాలో కనిపించని నివేదా థామస్ పవన్ చిత్రం లో చెల్లెలి కేరెక్టర్ కి ఓకె చెప్పిందని చాలామంది నమ్మేశారు. ఎంతైనా పవన్ తో కలిసి నటించే ఛాన్స్ వస్తే ఎవరైనా వదులుకుంటారా.. అందుకే అందరూ ఈ రూమర్ ని గట్టిగా నమ్మేశారు. అయితే ఈ గాసిప్స్ సొసైల్ మీడియాలో శృతి మించిపోవడంతో ఇక చేసేది లేక నివేద లైన్లోకొచ్చి తాను పవన్ చెల్లెలిగా నటించడం ఒట్టి గాసిప్పే అని కొట్టిపడేసింది. ఆ వార్తలన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే అని చెప్పినట్లు సమాచారం. ఇక నివేద పవన్ చెల్లెలిగా నటించకపోతే మరెవరు నటిస్తారో అని మళ్ళీ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది.