Advertisementt

కరీనా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది..!

Tue 20th Dec 2016 05:46 PM
bollywood heroine,kareena kapoor,aali khan,kareena kapoor childbirth,today son birth kareena kapoor  కరీనా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది..!
కరీనా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది..!
Advertisement
Ads by CJ

కరీనా కపూర్ బాలీవుడ్  టాప్ హీరోయిన్స్ లో ఒకరు. ఈమె కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే సైఫ్ ఆలీ ఖాన్ ని ప్రేమించి 2012లో వివాహమాడింది. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కరీనా సినిమాల్లో నటిస్తూ బిజీగానే వుంది. అయితే ఆమె తల్లి అవుతుందని తెలిసినప్పటినుండి కొంచెం కూడా రెస్ట్ లేకుండా తన పని తాను చేసుకుపోతూనే షూటింగ్స్ తో విరామం లేకుండా గడిపింది. ఆమె ప్రెగ్నెంట్ అయినప్పటినుండి యాడ్స్ లో నటించడం మొదలుకుని కవర్ పేజీ ల మీద ఫోటో షూట్స్ వరకు, ఇంకా పార్టీలకు, అవార్డ్స్ ఫంక్షన్స్ కి హాజరవుతూ ఓరా అనిపించింది. ఆమె నెలలు నిండినా కూడాఎటువంటి స్ట్రెస్ కి గురికాకుండా అందరితో హ్యాపీగా గడిపేసింది.

ఇక నెలలు నిండిన కరీనా ఇప్పుడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ రోజు(మంగళవారం డిసెంబర్ 20 ) ఉదయం కరీనా తల్లయిన విషయాన్ని సైఫ్ ఆలీ ఖాన్ ట్విట్టర్ ద్వారా అభిమానులకి తెలియజేసాడు. తల్లి, బిడ్డ క్షేమంగా వున్నారని తెలిపాడు. అయితే తమకి మొదటి నుండి ఆడపిల్ల పుడితే బావుండేదని అనుకునేవారమని..... కానీ ఇప్పుడు మాకు మగ బిడ్డ పుట్టాడని..... అబ్బాయి పుట్టడం కరీనాకి నాకు ఆశ్చర్యం కలిగించిందని సన్నిహితులకు చెబుతున్నాడట. ఏదిఏమైనా తమకు పుట్టిన బాబుని చూసి సైఫ్ ఆలీ ఖాన్ - కరీనా మురిసిపోతున్నారట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ