Advertisementt

గబ్బర్ సింగ్ 3 ని లైన్లో పెడుతున్నాడంట..!

Tue 20th Dec 2016 01:21 PM
pawan kalyan,director harish shankar,gabbar singh 3,dj movie,allu arjun  గబ్బర్ సింగ్ 3 ని లైన్లో పెడుతున్నాడంట..!
గబ్బర్ సింగ్ 3 ని లైన్లో పెడుతున్నాడంట..!
Advertisement
Ads by CJ

గబ్బర్ సింగ్ చిత్రం హ‌రీష్ శంక‌ర్ ను స్టార్ డైరెక్ట‌ర్ రేంజులోకి తీసుకెళ్ళిన విషయం తెలిసిందే. గబ్బర్ సింగ్ సినిమా ద‌బాంగ్‌కి రీమేక్ చిత్రమైనా సరే హరీష్ చేసిన మార్పులు చేర్పులతో గబ్బర్ సింగ్ చిత్రానికి కొత్త లుక్ ను తెచ్చాడు. అదే విధంగా మంచి హిట్ కోసం ఎదురు చూసిన పవ‌న్ అభిమానులకు కూడా కాస్త ఊరటనిచ్చాడు హరీష్ శంకర్.  అయితే ఆ తర్వాతగ‌బ్బ‌ర్ సింగ్‌కి సీక్వెల్‌గా బాబి దర్శకత్వంలో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ మాత్రం అట్టర్ ప్లాప్ అయిన విషయం కూడా తెలిసిందే. అయితే తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ కు గ‌బ్బ‌ర్‌సింగ్ లోని పోలీస్ క్యారెక్ట‌ర్‌పై మనసు పడినట్లు తెలుస్తుంది.

ప్ర‌స్తుతం దర్శకుడు హరీష్ శంకర్... అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం 2017 మార్చినాటికి పూర్తి కానుంది. ఆ తర్వాత హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ 3 చిత్రం చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటినుంచే వ్యూహాలు పన్నుతున్నట్లుగా కూడా టాక్ నడుస్తుంది. సరిగ్గా గ‌బ్బ‌ర్‌సింగ్‌లోని పోలీస్ క్యారెక్ట‌ర్‌ని ఆధారం చేసుకొనే హరీష్ క‌థను మలుస్తున్నట్లు కూడా వార్తలు అందుతున్నాయి. ఈ కథ కూడాను పవర్ స్టార్  ప‌వ‌న్ కళ్యాణ్ కు అయితే బాగా సెట్ అవుతుందని హరీష్ భావిస్తున్నట్లు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం ప‌వ‌న్ కళ్యాణ్ కూడా  ఏకబిగిన సినిమాలు ఒప్పేసుకొని పెద్ద ఎత్తున అదే పనిగా చేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా గతంలో పవన్ కళ్యాణ్ కూడా హ‌రీష్‌ శంకర్ తో ఇంకో సినిమా చేస్తానని మాట ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. అందుకనే అన్నీ కలిసివస్తే పవన్ కళ్యాణ్ తోనే హరీష్ గబ్బర్ సింగ్ 3 పట్టాలెక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కానీ.. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ చేస్తున్న డిజె చిత్రంతో సూపర్ డూపర్ హిట్టుగాని కొడితే ఆ తర్వాత హరీష్ రేంజ్ పవన్ సినిమాను ఖాయం చేయవచ్చని కూడా టాక్ నడుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ