Advertisementt

కోలీవుడ్‌లో కూడా ఆ ట్రెండ్‌ మొదలైంది..!

Tue 20th Dec 2016 01:09 PM
bollywood,tollywood,kollywood,directors combination movies,pa ranjith,suseendran,pandiraj  కోలీవుడ్‌లో కూడా ఆ ట్రెండ్‌ మొదలైంది..!
కోలీవుడ్‌లో కూడా ఆ ట్రెండ్‌ మొదలైంది..!
Advertisement
Ads by CJ

ఒక చిత్రానికి ఇద్దరు ముగ్గురు దర్శకత్వం వహించడం హాలీవుడ్‌, బాలీవుడ్‌లలో అప్పుడప్పుడు జరుగుతున్నా కూడా దక్షిణాదిలో మాత్రం ఈ ట్రెండ్‌ ఇంకా ఊపందుకోలేదు. తాజాగా ఒకే చిత్రానికి ముగ్గురు దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ఒకటి త్వరలో సెట్స్‌పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. కాగా ఈ ముగ్గురు క్రేజీ డైరెక్టర్సే కావడం విశేషం. 'కబాలి' ఫేం రంజిత్‌పా, సుశీంద్రన్‌, పాండిరాజ్‌ వంటి దర్శకులు ముగ్గురు త్వరలో ఓ చిత్రానికి కలిసి పనిచేయనున్నారు. ఈ చిత్రం మూడు విభిన్నమైన కథలతో రూపొందుతోంది. ఈ మూడుకథలను ఒకే చిత్రంలో అద్బుతంగా ఆవిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ముగ్గురు దర్శకులు ఒక్కో కథను డీల్‌ చేయనుండటం విశేషం. ఇప్పుడు ఈ విషయం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో ఎవరెవరు నటించనున్నారు? ఎవరు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు? అనేవి త్వరలో అఫీషియల్‌గా తెలియనున్నాయి. ఈ చిత్రం మంచి హిట్టయితే ఇదే ట్రెండ్‌ దక్షిణాదిలో కూడా ఊపందుకోవడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ