ప్రపంచమంతా క్రిష్ట్మస్ వేడుకలకి సిద్ధమైపోయింది. ఇక హైదరాబాద్ లో కూడా క్రిష్ట్మస్ వేడుకల సంబరాలు జరుపుకోవడానికి చిన్న పెద్ద రెడీ అయిపోతున్నారు. సెలబ్రిటీస్ కూడా తమ తమ ఇళ్లలో క్రిష్ట్మస్ ట్రీస్ ని స్పెషల్ గా డెకరేట్ చేస్తూ అభిమానులకి ఆనందాన్ని పంచుతున్నారు. ఇప్పటికే ప్రిన్స్ మహేష్ ఇంట్లో క్రిష్ట్మస్ సంబరాలు మొదలైపోయాయి. మహేష్ కూతురు సితార, కొడుకు గౌతమ్ తమ క్రిష్ట్మస్ ట్రీ ని ఎప్పుడో రెడీ చేసేసుకున్నారు. ఇక సమంత కూడా స్పెషల్ గా తాను నాగ చైతన్యతో కలిసి ఉంటున్న ఇంట్లో స్పెషల్ గా క్రిష్ట్మస్ ట్రీని ఎంతో ఓపికగా డెకరేట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ క్రిష్ట్మస్ ట్రీకి నాగ చైతన్య కూడా తుది మెరుగులు అద్దాడు.
అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఇంట్లో కూడా క్రిష్ట్మస్ సందడి మొదలైంది. క్రిష్ట్మస్ ట్రీని డెకరేట్ చేస్తూ అల్లు అర్జున్ ఒక పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. తన కొడుకు అల్లు ఆయాన్ కోసం, రీసెంట్ గా పుట్టిన తన కూతురు కోసం బన్నీ ఈ విధంగా క్రిష్ట్మస్ ట్రీని అలంకరిస్తున్నాడట. ఇక ఆ క్రిష్ట్మస్ ట్రీ కి రంగు రంగుల కాగితాలతో మంచి గిఫ్ట్ కవర్లు తో ఆ చెట్టు ను అలంకరిస్తూ అల్లు అర్జున్ బిజీ బిజీ గా కనిపిస్తున్నాడు. పై ఫోటోలో బన్నీ ఎంత బిజీగా వున్నాడో చూశారా..!