Advertisementt

పెళ్లికి వంకలు చెబుతున్న భళ్లాలదేవ..!

Mon 19th Dec 2016 05:50 PM
daggupati rana,baahubali movie,rana marriage,tollywood,kollywood,bollywood  పెళ్లికి వంకలు చెబుతున్న భళ్లాలదేవ..!
పెళ్లికి వంకలు చెబుతున్న భళ్లాలదేవ..!
Advertisement
Ads by CJ

దగ్గుబాటి వంశం నుంచి వచ్చిన ఆరడుగుల ఆజానుబాహుడైన రానా కెరీర్‌ ప్రస్తుతం మంచి ఊపులో ఉంది. ఆయన ఇప్పటివరకు సోలో హీరోగా సక్సెస్‌ కానప్పటికీ 'బాహుబలి'లో భళ్లాలదేవగా నెగటివ్‌ రోల్‌తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. ఈయన కేవలం టాలీవుడ్‌లోనే గాక, కోలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాలలో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే 32 ఏళ్లు వచ్చిన ఈయనకు 'బాహుబలి2' తర్వాత పెళ్లి జరగనుందనే వార్తలు వచ్చాయి. అన్ని ఇండస్ట్రీలలోని హీరోయిన్లతో ఎంతో ఫ్రెండ్లీగా ఉండే ఈయనపై రోజుకో ఎఫైర్‌ వార్తలు వస్తూ, సంచనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. 

కాగా ఈ బ్రహ్మచారి 'బాహుబలి2' తర్వాత కూడా ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని స్పష్టమైంది. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నా జీవితం ప్రస్తుతం క్రమబద్దంగా జరగడం లేదు. నేను ఇంకా కెరీర్‌పరంగా గానీ, లైఫ్‌లో గానీ సెటిల్‌ కాలేదు. బాలీవుడ్‌లో చిత్రం అంటే ముంబైకి వెళ్లి అక్కడే నెలలకు నెలలు గడపాల్సివస్తోంది. ఇక కోలీవుడ్‌, టాలీవుడ్‌లలో కూడా బిజీగా ఉంటూ ఇంటికి ఎక్కువకాలం దూరంగా ఉండాల్సివస్తోంది. త్వరలో టీవీషోలపై చర్చించడానికి అమెరికా వెళ్తున్నాను. అక్కడ మూడునాలుగు నెలలు ఉండాల్సివుంది. చర్చలు ఆలస్యమైతే అక్కడే ఒక ఏడాది ఉన్నా ఆశ్యర్యం లేదు. అందువల్ల ఇప్పడే పెళ్లి చేసుకుంటే నన్ను చేసుకునే అమ్మాయి బాధపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి పెళ్లికి ఇంకా దూరంగా ఉండాలనుకుంటున్నానని తెలిపాడు రానా. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ