Advertisementt

చిరు బలం చిరుది..బాలయ్యది బాలయ్యదే!

Mon 19th Dec 2016 05:38 PM
balakrishna,gautamiputra satakarni movie,chiranjeevi,khaidi no 150 movie  చిరు బలం చిరుది..బాలయ్యది బాలయ్యదే!
చిరు బలం చిరుది..బాలయ్యది బాలయ్యదే!
Advertisement

చాలా ఏళ్ల తర్వాత... వచ్చే సంక్రాంతి బరిలో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్‌ 150' చిత్రం, నటసింహం బాలకృష్ణ నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి'లు పోటీపడబోతున్నాయి. బాలయ్యకు ఇది వందో చిత్రం కావడం, చిరుకు ఈ చిత్రం 150వ చిత్రం కావడంతో ఇవి ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్నాయి. కాగా బాలయ్య నటించిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' చిత్రం టీజర్‌తో పాటు ట్రైలర్‌లో కూడా బాలయ్య తన ప్లస్‌పాయింట్స్‌ అయిన రాజు గెటప్‌లో రాజసం, ఠీవి, అదరగొట్టే డైలాగ్స్‌ను హైలైట్‌ చేశాడు. అలాగే చిత్రానికి ఎంతో ప్లస్‌గా నిలిచే అవకాశం ఉన్న అద్భుతమైన విజువల్స్‌ను, యద్దసన్నివేశాలను చూపించాడు. 

కాగా చిరు తనకి ఉన్న ప్లస్‌ పాయింట్స్‌ అయిన ఫైట్స్‌, డ్యాన్స్‌, డిఫరెంట్‌ బాడీలాంగ్వేజ్‌ వంటి అంశాలను హైలైట్‌ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం టీజర్‌లో ఫైట్స్‌తో అదరగొట్టి, తన బాడీలాంగ్వేజ్‌ను, తన గెటప్‌ను చూపించిన చిరు, తాజాగా విడుదలైన సాంగ్‌ 'అమ్మడు లెట్స్‌ డు కుమ్ముడు...' పాటలో తనకున్న క్రేజ్‌కు కారణమై, తనను మెగాస్టార్‌ని చేసిన డ్యాన్స్‌లపై దృష్టి పెట్టి అదరగొట్టాడు. ఇక బాలయ్య చిత్రం ట్రైలర్‌లో సీనియర్‌ హీరోయిన్‌ శ్రియ రొమాంటిక్‌గా కనిపిస్తుంటే, చిరు చిత్రంలో యంగ్‌ హీరోయిన్‌ కాజల్‌ అందాల ప్రదర్శన ఆకట్టుకుంది. 

చిరు విషయానికి వస్తే 'దిస్‌ ఈజ్‌ నాట్‌ ఎ మాస్‌సాంగ్‌... దిస్‌ ఈజ్‌ బాస్‌సాంగ్‌' అంటూ పాటను మొదట్లో ఆరంభిస్తూ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ గొంతుతో ప్రారంభమైన ఈ పాట ఇప్పుడు కేకపుట్టిసూ, హోరెత్తిస్తోంది. ఆద్యంతం ఫుల్‌ మాస్‌బీట్‌లో ఎంతో ఎనర్జిటిక్‌గా, మాస్‌, క్లాస్‌, చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ పాట సోషల్‌మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఒక్క పాటే ఇలా ఉంటే ఇక మిగిలిన సాంగ్స్‌ ఎలా ఉంటాయో? అనే విషయంలో అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి. ఇక ఈ చిత్రం మొదటి టీజర్‌లో దేవిశ్రీ అదిరిపోయే బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ చేసినప్పటికీ అది సల్మాన్‌ నటించిన 'సుల్తాన్‌' టీజర్‌లోని మ్యూజిక్‌ను కాపీ కొట్టాడనే విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. 

ఇక బాలయ్య చిత్రం ట్రైలర్‌లో... దేవిశ్రీ అర్ధాంతరంగా తప్పుకున్నప్పటికీ చిరంతన్‌భట్‌ అందించిన బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అదరగొట్టి అద్భుతంగా ఉంది. మరోవైపు చిరు చిత్రం సాంగ్స్‌ను ఈనెల 25న డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి విడుదల చేసి, జనవరి4వ తేదీన ఈ చిత్రం ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ను విజయవాడలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇక బాలయ్య చిత్రం ఆడియో వేడుక తిరుపతిలో నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికే విడుదల కావాల్సిన ఆడియో వేడుక వాయిదా పడింది. మరి బాలయ్య ఆడియో వేడుక ఎప్పుడో తెలియాల్సివుంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement