మెగాస్టార్ అభిమానులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా పెద్ద ఎత్తున పండుగ చేసుకోవలసిన అరుదైన సంఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నోటి నుండి ఒక్కసారిగా మెగా హీరోల పేర్లు వెలువడ్డాయి. టాలీవుడ్ హీరోలలో మీకు ఎవరంటే అభిమానం అన్న ప్రశ్నకు అమీర్ టకీమని.. చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల పేర్లు చెప్పేశాడు. కాగా టాలీవుడ్ లో వారిద్దరితో కలిసి నటించే అవకాశంగానీ తనకు వస్తే ఖచ్చితంగా సంతోషంతో అంగీకరిస్తానని అమీర్ తెలిపాడు. అయితే అమీర్ ఖాన్ కథానాయకుడిగా చేసిన దంగల్ చిత్రం ఈనెల 23వ తేదీ పెద్ద ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చన అమీర్ ఖాన్ ఈ విదంగా స్పందించాడు.
టాలీవుడ్ లో తనకు అభిమాన నటుల గురించి ప్రస్తావిస్తూ... మెగా బ్రదర్స్ పేర్లు వెల్లడించాడు. ఇంకా తమిళ నాట అయితే తాను రజనీకాంత్‌ని అమితంగా ఆరాధిస్తానని అమీర్ ఖాన్ తెలిపాడు. ఎప్పుడైనా గానీ సౌత్ నుంచి తనకు సినిమా అవకాశం వస్తే వదులుకోనని, అప్పుడు తప్పకుండా తాను తెలుగు నేర్చుకుంటానని అమీర్ ఖాన్ వివరించాడు. మొత్తానికి దంగల్ చిత్రం ప్రమోషన్ ను జోరుగా జరుపుతున్న అమీర్ అటు తమిళనాడులోనూ, ఇటు తెలుగులోనూ ఆయా ప్రాంత సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఆయా హీరోలను బాగానే వాడేసుకుంటున్నాడు మరి.