Advertisementt

కృష్ణవంశీ చేతిలో పడిందిగా..దశ తిరిగినట్లే..!

Sun 18th Dec 2016 02:29 PM
krishna vamsi,regina,nakshatram movie  కృష్ణవంశీ చేతిలో పడిందిగా..దశ తిరిగినట్లే..!
కృష్ణవంశీ చేతిలో పడిందిగా..దశ తిరిగినట్లే..!
Advertisement
Ads by CJ

హీరోయిన్లను ఎంతో అందంగా, పాటలను అద్భుతంగా తీయడంలో రాఘవేంద్రుని తర్వాతి స్దానం కృష్ణవంశీదే అని చెప్పాలి. చాలా మంది దర్శకులు తాము తీసే చిత్రాలలోని పాటలను మాత్రం కృష్ణవంశీ చేత తీయించడానికి కూడా సిద్దపడిపోతూ ఉంటారు. ఇక గ్లామర్‌ను ఒలకబోసే హీరోయిన్‌ ఆయన చేతిలో పడిందంటే ఇక వెండితెర నిండా అందాల ఆరబోతలకు కొరవుండదు. ఈ విషయం గతంలో కూడా ఎన్నోసార్లు రుజువైంది. తాజాగా ఆయన చేతిలో రెజీనా పడింది. కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్‌కిషన్‌ హీరోగా సాయిధరమ్‌తేజ్‌, ప్రగ్యాజైస్వాల్‌లు కీలకపాత్రల్లో నటిస్తున్న 'నక్షత్రం' చిత్రంలో రెజీనా హీరోయిన్‌ అన్న సంగతి తెలిసిందే. తనతోపాటే ఫీల్డ్‌కి వచ్చిన రకుల్‌ప్రీత్‌సింగ్‌ వంటి వారు స్టార్స్‌ చిత్రాలలో అవకాశాలు సాధిస్తూ దూసుకుపోతుంటే ఈ అమ్మడు మాత్రం సక్సెస్‌ఫుల్‌ చిత్రాలు చేస్తున్నప్పటికీ సెకండ్‌ హీరోయిన్‌గా లేదా అప్‌కమింగ్‌ హీరోల సరసన మాత్రమే అవకాశాలు సాధిస్తోంది. లిప్‌లాక్‌ సీన్స్‌ నుంచి గ్లామర్‌షో వరకు రెజీనా దేనికైనా రెడీగానే ఉంది. ఆమె నటించిన 'రా..రా..కృష్ణయ్య' చిత్రంలోని ఓ పాటలో ఆమె చూపిన అందాల ప్రదర్శనను అంత తొందరగా ఎవ్వరూ మర్చిపోరు. కాగా ఈ అమ్మడు కృష్ణవంశీ దర్శకత్వంలో చేస్తున్న 'నక్షత్రం' చిత్రంలోని టీజర్‌లో మరింతగా రెచ్చిపోయింది. ఈ వీడియో సెగలు పుట్టిస్తోంది. ఇందులో రెజీనా జూనియర్‌ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ చిత్రంతో పాటు ఆమె బాలీవుడ్‌లో బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌తో కలిసి నటిస్తున్న 'ఆంఖే2' చిత్రాలు రెండింటిపై ఆమె బోలెడు ఆశలు పెట్టుకుంది. ఈ రెండింటితో తాను కూడా స్టార్‌హీరోయిన్‌గా ఎదుగుతాననే నమ్మకంతో ఉంది. మరి ఆమె కల నెరవేరుతుందో లేదో వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ