Advertisementt

మరో బయోపిక్‌లో మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌!

Sun 18th Dec 2016 02:01 PM
amir khan,rakesh sharma bip pic,kapil sharma,i me aur main  మరో బయోపిక్‌లో మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌!
మరో బయోపిక్‌లో మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌!
Advertisement
Ads by CJ

ఓ పాత్ర కోసం ఎంతటి త్యాగానికైనా, కష్టానికైనా వెనుకాడని స్టార్‌ అమీర్‌ఖాన్‌. అందుకే అమీర్‌ను అందరూ ముద్దుగా మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ అని పిలుస్తుంటారు. బయోపిక్‌ చిత్రాలలోని పాత్రలు రక్తికట్టించడంలో ఆయన్ను మించిన వారు లేరనే చెప్పాలి. కాగా ప్రస్తుతం బయోపిక్‌గా రూపొందుతున్న 'దంగల్‌' చిత్రం త్వరలో విడుదలకానుంది. దీని తదుపరి మరో బయోపిక్‌లో అమీర్‌ నటించడానికి ఒప్పుకున్నాడట. ఈ తరం వారికి రాకేష్‌శర్మ అంటే పెద్దగా తెలియకపోవచ్చు. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయ వ్యోమగామి ఆయనే. కాగా రాకేష్‌శర్మ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందే చిత్రం ద్వారా అమీర్‌ ఏకంగా ఆస్కార్‌పై గురిపెట్టాడని అంటున్నారు. ఈ చిత్రమే కనుక పట్టాలెక్కితే తొలి భారతీయ స్పేస్‌మూవీగా ఈ చిత్రం రికార్డులకెక్కడం ఖాయం. కాగా రాకేష్‌ శర్మ కుమారుడు కపిల్‌శర్మకు బాలీవుడ్‌లో దర్శకునిగా నిలదిక్కుకోవాలనేది పెద్ద కోరిక. ఆయన ఇప్పటికే జాన్‌ అబ్రహం హీరోగా 'ఐ, వుయ్‌ ఔర్‌ మైనే' తెరకెక్కించాడు. స్టార్స్‌లేకపోయినా కూడా ఈ చిత్రం బాలీవుడ్‌లో విజయఢంకా మోగించింది. మొదటి నాలుగురోజుల్లోనే ఆరుకోట్లకు పైగా వసూలు చేసి ట్రేడ్‌ పండితులను ఆశ్చర్యపరిచింది. ఆయనే తన తండ్రి జీవిత చరిత్రకు దర్శకత్వం వహిస్తాడనే ప్రచారం ప్రస్తుతం బిటౌన్‌లో వినిపిస్తుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ