Advertisementt

బన్నీ కోసం ఆ దర్శకుడిని లాక్ చేశారా..!

Sat 17th Dec 2016 09:35 PM
bunny,allu aravind,dj,duvvada jagannadam,vi anand  బన్నీ కోసం ఆ దర్శకుడిని లాక్ చేశారా..!
బన్నీ కోసం ఆ దర్శకుడిని లాక్ చేశారా..!
Advertisement
Ads by CJ

బన్నీ నటించే ప్రతి చిత్రం కథ నుంచి దర్శక, సాంకేతిక నిపుణులు, ఇతర నటీనటుల ఎంపిక వరకు ఆయన తండ్రి అల్లుఅరవింద్‌ మాస్టర్‌ బ్రెయిన్‌ ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. బన్నీ ఇంతలా వరుస విజయాలు సాధించడానికి, స్టార్‌గా వెలిగిపోవడానికి తెరవెనుక అల్లు మాస్టర్‌ మైండ్‌ ఎంతగానో ఉంది. ప్రస్తుతం బన్నీ.. దిల్‌రాజు నిర్మాతగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'డిజె' (దువ్వాడ జగన్నాథం) చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌లో బన్నీ పాల్గొనలేదు. ఇక ఆలస్యంగా రెండో షెడ్యూల్‌ నుంచి బన్నీ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యాడు. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 40శాతం వరకు షూటింగ్‌ పూర్తయింది. ఈనెల 18 నుంచి హైదరాబాద్‌లో 15రోజుల పాటు మూడోషెడ్యూల్‌ను ప్రారంభిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో బన్నీ, హీరోయిన్‌ పూజాహెగ్డేలపై పలు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ వివరాలను బయటకు రాకుండా, ఎంతో సీక్రెట్‌గా, సైలెంట్‌గా కాపాడుతూ వస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని కేవలం నాలుగునెలల్లో పూర్తి చేసి వేసవి కానుకగా విడుదల చేయనున్నారు. ఇక దిల్‌రాజు-బన్నీ- దేవిశ్రీల కాంబినేషన్‌ అంటే ఆ చిత్రం ఎంతటి మ్యూజికల్‌ హిట్‌గా నిలుస్తుందో అందరికీ తెలుసు. ఈ చిత్రానికి కూడా సంగీతాన్ని దేవిశ్రీ అందిస్తుండటంతో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. 

ఈ చిత్రం తర్వాత బన్నీ చేత అల్లుఅరవింద్‌ కోలీవుడ్‌ ఎంట్రీ ఇప్పిస్తున్నాడు. ఇప్పటికే కేరళలో మంచి క్రేజ్‌ ఉన్న బన్నీకి కోలీవుడ్‌ మార్కెట్‌ను కూడా జత చేయాలని అల్లు మాస్టర్‌ ప్లాన్‌ వేసిన సంగతి తెలిసిందే. దీంతో 'డిజె' తర్వాత తెలుగులో అల్లుఅరవింద్‌ నిర్మాతగా, తమిళంలో స్టూడియోగ్రీన్‌ సంస్థ అధినేత కె.ఇ.జ్ఞానవేల్‌రాజా భాగస్వామ్యంలో మాస్‌ డైరెక్టర్‌గా మంచి పేరున్న లింగుస్వామి దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ ద్విభాషా చిత్రం ప్లాన్‌ చేసిన సంగతి కూడా తెలిసిందే. కాగా మురుగదాస్‌ శిష్యుడు విఐ ఆనంద్‌ దర్శకత్వం వహించిన 'టైగర్‌' చిత్రం పెద్దగా కమర్షియల్‌గా హిట్‌ కాకపోయినా ఆనంద్‌ మేకింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఆయన నిఖిల్‌తో తీసిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి లోబడ్జెట్‌ చిత్రంతో సంచలన విజయం సాధించిన దర్శకుడు ఆనంద్‌పై బన్నీ-అల్లుల దృష్టి పడిందని సమాచారం. అందుకే ఈ చిత్రం ఇప్పుడే ప్రారంభమయ్యే అవకాశాలు లేకపోయినా ఆనంద్‌తో బన్నీ చిత్రానికి అరవింద్... ఆనంద్‌తో అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నాడని ఫిల్మ్‌నగర్‌ లేటెస్ట్‌ న్యూస్‌...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ