Advertisementt

ఈమె లేడీ గజినీ.. అంట..!

Sat 17th Dec 2016 09:29 PM
rakhi sawant,rakhi sawant sensational news,lady gajini  ఈమె లేడీ గజినీ.. అంట..!
ఈమె లేడీ గజినీ.. అంట..!
Advertisement
Ads by CJ

రాఖీసావంత్‌.. ఈ మాట చెబితే దేశవ్యాప్తంగా కుర్రకారులు మతులు పోతాయి. కానీ ఈమె ఈమధ్య ఎక్కడా కనిపించడం లేదు. ఈమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ, దానికి గల కారణాలను మీడియాకు వెల్లడించింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ, నేను రెండేళ్ల కిందట ఓ చిత్రం షూటింగ్‌ కొలంబోలో జరుగుతున్న సమయంలో సెట్‌ అంతా పొగ నిండి ఉండటంతో కనిపించక ఏదో తగిలి కిందపడిపోయాను. తలపై తీవ్రమైన గాయం అయింది. దాంతో నాకు గుండు చేసి మరీ తలకు ఆపరేషన్‌ చేశారు. దాంతో నా జీవితం తల్లకిందులైంది. అందుకే పబ్లిక్‌లోకి రాలేకపోయాను. తలకు తగిలిన గాయం వల్ల జ్ఞాపకశక్తి కూడా పోయింది. దాంతో మనుషుల పేర్లను కూడా మర్చిపోయాను. దాదాపు లేడీ గజినీ లా మారాను. ఈ రెండేళ్ల కాలంలో రెస్ట్‌ తీసుకోవడం వల్ల బాగా లావు పెరిగిపోయాను. కానీ ఆ తర్వాత మరింత కష్టపడి సన్నగా 'దబాంగ్‌' స్టైల్‌లో మారిపోయాను. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాను. అయితే ఇలా జరిగినందుకు నేనేమి కుంగిపోలేదు... అంటూ తాను పడ్డ కష్టాన్ని ఉద్వేగంగా చెప్పుకొచ్చింది. rakhi sawant

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ