Advertisementt

వివాదాలల్లో సూర్య 'ఎస్‌3'..!

Sat 17th Dec 2016 01:43 PM
s 3 movie,director hari,release date postponed,s 3 movie online ticket issue,studio green director gnanavel raja  వివాదాలల్లో సూర్య 'ఎస్‌3'..!
వివాదాలల్లో సూర్య 'ఎస్‌3'..!
Advertisement
Ads by CJ

స్టార్‌ హీరో సూర్య పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో హరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఎస్‌3'. కాగా స్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మాణంలో ఈ చిత్రం భారీగా తెరకెక్కింది. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయినా పలు కారణాల వల్ల ఈ చిత్రం జనవరి 26కు వాయిదాపడింది. ప్రస్తుతం ఈ చిత్రంపై వివాదాలు చుట్టుముడుతున్నాయి. 'సింగం' సిరీస్‌పై ఉన్న నమ్మకంతో ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ను సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత మల్కాపురం శివకుమార్‌ 18కోట్ల భారీ మొత్తానికి హక్కులు పొందాడని సమాచారం. 

ఈ చిత్రం పలుమార్లు వాయిదాలు పడుతుండటంతో ఆయన కోపగించుకున్నాడట. జనవరి 26న ఈ చిత్రాన్ని తెలుగులో భారీ ఎత్తున రిలీజ్‌ చేయడం కష్టమని, ఇప్పటికే ఈ చిత్రం పలుసార్లు వాయిదాలు పడటంతో తాను బాగా నష్టపోతున్నానని, కాబట్టి ఈ చిత్రం హక్కుల కోసం తాను ఈ చిత్ర నిర్మాత జ్ఞానవేల్‌రాజాకు ఇచ్చిన అడ్వాన్స్‌ను తిరిగి తనకు ఇచ్చేయాలి అని ఒత్తిడి చేస్తున్నాడట. 

మరోపక్క ఈ చిత్రం ఈనెల 23నే విడుదల అవుతుందని భావించిన ఈ చిత్ర నిర్మాతలు తమిళనాడులో ఆల్‌రెడీ ప్రీ రిలీజ్‌ బుకింగ్స్‌ను ప్రారంభించడం విశేషం. ఈ చిత్రంపై ఓ వ్యక్తి చెన్నై హౖెెకోర్టులో ఈ చిత్ర నిర్మాతలపై, బయ్యర్లపై, థియేటర్ల యాజమాన్యాలపై ఓ పిటిషన్‌ ఫైల్‌ చేశాడు. చెన్నైకి చెందిన దేవరాజన్‌ అనే వ్యక్తి ఈ చిత్రం ఆన్‌లైన్‌ టిక్కెట్స్‌ బుకింగ్‌ వెబ్‌సైట్లు ప్రభుత్వం నిర్దేశించిన టిక్కెట్టు మొత్తాల కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని, కాబట్టి ఈ విషయంపై న్యాయం కోరుతూ ఈ పిటిషన్‌ వేశాడు. దీంతో చెన్నై హైకోర్టు ఈ విషయంపై ఈ చిత్ర నిర్మాతలు, ఇతరులు డిసెంబర్‌ 21లోగా తమకు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ