Advertisementt

కృష్ణవంశీది పెద్దమనసు..!

Fri 16th Dec 2016 09:38 PM
krishna vamshi,regina cassandra,regina cassandra birthday on decenber 13th 2016,krishna vamshi wishes to regina,metlited happy birthday regina i am sorry let wishes  కృష్ణవంశీది పెద్దమనసు..!
కృష్ణవంశీది పెద్దమనసు..!
Advertisement
Ads by CJ

సాధారణంగా నటీనటులు, ఇతర టెక్నీషియన్స్‌ పుట్టినరోజు వస్తే ఆ చిత్రం షూటింగ్‌లో వారి చేత కేక్‌ కోయించడం, యూనిట్‌ మొత్తం శుభాకాంక్షలు తెలపడం రొటీన్. కానీ రెజీనా మాత్రం ఆ అదృష్టానికి నోచుకోలేదు. ఆమె బర్త్‌డే డిసెంబర్‌ 13. ఆ రోజున ఆమె కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్‌కిషన్‌ హీరోగా నటిస్తున్న 'నక్షత్రం' షూటింగ్‌లో పాల్గొంది. కానీ ఆమె పుట్టినరోజు విషయం యూనిట్‌లో ఎవ్వరికీ గుర్తుకురాలేదు. 

కానీ ఆమె పుట్టినరోజు విషయం రెండు రోజుల ఆలస్యంగా తెలుసుకున్న దర్శకుడు కృష్ణవంశీ రెజీనాకు ఫేస్‌బుక్‌ ద్వారా క్షమాపణలు చెప్పాడు. సారీ... రెజీనా.. నీ పుట్టినరోజును మర్చిపోయాం. క్షమించు. 2017వ సంవత్సరం నీదే అవుతుంది. ఆల్‌ది బెస్ట్‌. అసలు విషెస్‌ చెప్పకుండా ఉండటం కంటే కాస్త ఆలస్యంగా అయినా చెప్పడం నయమే కదా...! అందుకోసం నీకు మరోసారి క్షమాపణలు చెబుతున్నానంటూ పోస్ట్‌ చేశాడు. అంతేకాదు... ఈ సందర్భంగా ఆయన 'నక్షత్రం' చిత్రంలోని రెజీనా వర్కింగ్‌ వీడియోను సైతం విడుదల చేశాడు. మొత్తానికి ఈ విషయంలో కృష్ణవంశీ ఓపెన్‌నెస్‌ చూసి పలువురు ప్రశంసిస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ