ఎన్నోఏళ్లు వరుస పరాజయాలతో వెనుకబడి, ఇక అతని పనైపోయింది..నేటి ట్రెండ్‌కు, యువతకు నచ్చేలా చిత్రాలు తీయడం క్రియేటివ్ జీనియస్ మణిరత్నంకు చేతకాదనే విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో ఆయన నిత్యామీనన్, దుల్కర్‌సల్మాన్ జంటగా... ప్రేమ, సహజీవనం వంటి వాటిపై విపరీతమైన ఆసక్తి చూపుతున్న యువత నాడిని పట్టుకొని తీసిన 'ఓకేబంగారం' (ఓకే కన్మణి) చిత్రం దక్షిణాదిలో మంచి విజయం సాధించింది.
కానీ నిత్యామీనన్ ఎక్స్‌పోజింగ్‌కు దూరం కావడం వల్ల... అలాగే తాను హద్దులు మించి రొమాంటిక్ సీన్స్ తీస్తే తన ఇంత గొప్ప కెరీర్‌కు చెడ్డపేరు వస్తుందని భావించిన మణి ఈ చిత్రాన్ని అసభ్యతకు తావులేకుండా నిత్యా, దుల్కర్‌ల మధ్య మంచి కెమిస్ట్రీని గొప్పగా ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కాగా ప్రస్తుతం మణిరత్నం తన మద్రాస్ టాకీస్, కరణ్‌జోహార్‌ల 'ధర్మ ప్రొడక్షన్స్' బేనర్లలో నిర్మాతలుగా సంయుక్తంగా 'ఓకే బంగారం'ను 'ఓకే జాను' పేరుతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణి శిష్యుడు షాద్‌అలీ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇందులో ఆదిత్యారాయ్ కపూర్, శ్రద్దాపూర్‌లు రెచ్చిపోయి నటిస్తున్నారు. ఈ చిత్రం దక్షిణాదికి భిన్నంగా పలు హాట్ హాట్ సీన్స్‌తో, లిప్‌లాక్ సీన్స్‌తో రూపొందుతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ఉత్తరాదిని మొత్తం షేక్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రంలోని ఓ పాట వీడియోను రిలీజ్ చేశారు. అప్పుడెప్పుడో అరవింద్‌స్వామి, మనీషాకోయిరాలు జంటగా మణి తెరకెక్కించిన 'బొంబాయి' చిత్రంలో రెహ్మాన్ కంపోజ్ చేసిన 'హమ్మ, హమ్మ, హమ్మ....' సాంగ్ దక్షిణాదినే కాదు బాలీవుడ్‌లోనే సంచలనం సృష్టించింది.
కాగా తాజాగా 'ఓకే జానూ' చిత్రంలో ఈ పాటను మరోసారి రెహ్మాన్ రీమిక్స్ చేశాడు.ఈ పాటలో శ్రద్దాకపూర్ యువతరం మతులను పోగొడుతోంది. కేవలం ట్రైలర్, ఓ సాంగ్ టీజర్‌తోనే ఇంతగాహట్‌గా కవ్విస్తున్న ఈ జంట ముఖ్యంగా శ్రద్దపూర్ రేపు చిత్రం విడుదలైన తర్వాత ఎంతటి సంచలనాలు సృష్టిస్తోందోనని అందరూ ఎదురుచూస్తున్నారు. కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ చిత్రంతో నిర్మాతగా మణి సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.