Advertisementt

యాంకర్ శ్రీముఖిని నో అన్న హీరో..!

Fri 16th Dec 2016 04:41 PM
allu arjun,anchor sreemukhi,allu arjun new movie dj,heroine pooja hegde  యాంకర్ శ్రీముఖిని నో అన్న హీరో..!
యాంకర్ శ్రీముఖిని నో అన్న హీరో..!
Advertisement
Ads by CJ

ఇప్పుడు యాంకర్ శ్రీముఖి కి అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ వచ్చి చేజారిపోయిందనే మాట వినిపిస్తోంది. 'పాపం శ్రీముఖి' అని సోషల్ మీడియా లో ఒకటే కామెంట్స్ వినిపిస్తున్నాయి. శ్రీముఖి బుల్లితెర మీద అనసూయ, రష్మీలకి గట్టి పోటీ ఇస్తూ హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ప్రముఖ ఛానెల్ లో అన్ని షోలకి శ్రీముఖిని యాంకర్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారంటే చూడండి ఆమె పాపులారిటీ ఎంత ఎక్కువగా ఉందొ. ఇకపోతే శ్రీముఖి ఒక్క యాంకర్ గానే కాకుండా వెండితెర మీద కూడా తన అదృష్టాన్ని అప్పుడపుడు పరీక్షించుకుంటుంది. 

అల్లు అర్జున్ 'జులాయి', నాని 'జంటిల్మన్' లలో శ్రీముఖి మంచి పాత్రలే చేసింది. ఇంకా మరికొన్ని సినిమాల్లో కనిపించిన శ్రీముఖి తాజాగా అవసరాల శ్రీనివాస్ హీరోగా తెరకెక్కే అడల్ట్‌ కామెడీ చిత్రం 'హంటర్‌’ లో నటిస్తోంది. అయితే ఇప్పుడు శ్రీముఖి కి అల్లు అర్జున్ హీరోగా రానున్న 'దువ్వాడ జగన్నాథం' చిత్రం లో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందని తెగ ప్రచారం జరిగింది. అబ్బో ఇంకేమిటి శ్రీముఖి కి అదృష్టం తలుపు తట్టింది అనుకునే లోపు ఆ ఛాన్స్ ఆమె నుండి దూరమైందని న్యూస్ బయటికి వచ్చింది.

బన్నీ 'డీజే' లో మెయిన్ హీరోయిన్ గా పూజ  హెగ్డే ని తీసుకున్న చిత్ర యూనిట్ రెండో హీరోయిన్ గా శ్రీముఖి ని తీసుకున్నారని అన్నారు. కానీ శ్రీముఖితో రొమాన్స్ చెయ్యడానికి అల్లు అర్జున్ నో చెప్పాడని సమాచారం. ఎందుకంటే అల్లు అర్జున్ ఇదివరకే శ్రీముఖి తో 'జులాయి' చిత్రంలో అన్న కేరెక్టర్ లో నటించాడు. అందులో అన్నగా నటించిన బన్నీ 'డీజె'లో శ్రీముఖితో రొమాన్స్ చేస్తే బాగోదని.. అందుకే శ్రీముఖిని తప్పించినట్లు వార్తలొస్తున్నాయి. పాపం శ్రీముఖి ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది . దేనికైనా అదృష్టం వుండాలి కదా అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ