తన రీఎంట్రీ మూవీ, తన 150వ చిత్రంగా రూపొందుతున్న 'ఖైదీనెంబర్150' చిత్రం విషయంలో చిరు తన సెంటిమెంట్స్‌ను బాగా ఫాలో అవుతున్నాడని చెప్పకతప్పదు. తాను రాజకీయాల్లోకి రాకముందు ఆయన నటించిన దాదాపు చివరి అతి పెద్ద హిట్ చిత్రం 'ఠాగూర్'. ఈ చిత్రం తమిళ చిత్రం 'రమణ'కు రీమేక్‌గా రూపొందించారు. కాగా 'ఖైదీ నెంబర్150' కూడా తమిళ మూవీ 'కత్తి'కి రీమేక్‌గా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
కాగా తన 150వ చిత్రం కోసం ఎందరో దర్శకులు, ఎన్నోకథలు విన్న చిరు చివరకు 'కత్తి' రీమేక్‌కే ఓటేయడమే కాదు.. 'ఠాగూర్' చిత్ర దర్శకుడు వినాయక్ ఫ్లాప్‌ల్లో ఉన్నప్పటికీ ఈ చిత్రానికి దర్శకునిగా ఆయన్నే ఎంచుకున్నాడు. ఇక 'కత్తి'కి దర్శకుడైన మురుగదాస్ దర్శకత్వంలోనే 'రమణ' చిత్రం కూడా రూపొందింది. అలాగే 'ఠాగూర్'తో పాటు 'ఖైదీ' చిత్రానికి కూడా కథతో పాటు స్క్రీన్‌ప్లే కూడా ఆయనే అందిస్తున్నాడు. దీంతో మురుగదాస్ సెంటిమెంట్ కూడా తనకు కలిసొస్తుందనే నమ్మకంతో చిరు ఉన్నాడు. ఇక 'ఠాగూర్' చిత్రంలోని పాటకి లారెన్స్ కొరియోగ్రఫీ అందించాడు.
ప్రస్తుతం 'ఖైదీ' చిత్రంలో కూడా లారెన్స్ డ్యాన్స్ మాస్టర్‌గా ఓ పాటను చేశాడు. దర్శకునిగా, హీరోగా లారెన్స్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఆయన్ను ఒప్పించి మరీ ఈ చిత్రంలో ఆయన చేత పనిచేయించారు. 'ఠాగూర్'తో పాటు 'ఖైదీ'కి కూడా వెటరన్ రైటర్స్ పరుచూరి బ్రదర్సే మాటలు అందిస్తుండటం విశేషం. మరోపక్క 'ఠాగూర్'చిత్రంలో చిన్న కామియో పాత్ర చేసిన వినాయక్ చేత చిరు 'ఖైదీ నెంబర్ 150'లో కూడా పట్టుబట్టి మరీ ఓ పాత్ర వేయిస్తున్న సంగతి కూడా తెలిసిందే. 'కత్తి' చిత్రంలో మురుగదాస్ కనిపించే సీన్‌లోనే వినాయక్ కనిపించనున్నాడు. ఇక ఈ రెండు చిత్రాలూ సోషల్‌మెసేజ్‌తో రూపొందుతున్నవే. తమిళంలో ఈ రెండు చిత్రాలు డ్రై సబ్జెక్ట్స్. కానీ వాటికి ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు నవరసాలు జోడించి, చిరు ఇమేజ్‌కు అనుగుణంగా కమర్షియల్ టచ్ ఇస్తూ పలు మార్పులు చేశారు.వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే చిరు తన 'ఠాగూర్' సెంటిమెంట్స్ 'ఖైదీ నెంబర్ 150'కి కూడా ఫాలో అవుతున్నాడని చెప్పకతప్పదు.