Advertisementt

నవ్వుల నెలగా డిసెంబర్‌..!

Thu 15th Dec 2016 05:18 PM
prudhvi hero movie,meelo evaru koteeswarudu movie,allari naresh movie,intlo deyyam nakem bhayam movie,saptha giri movie,saptha giri express movie,december month comedy cinemas  నవ్వుల నెలగా డిసెంబర్‌..!
నవ్వుల నెలగా డిసెంబర్‌..!
Advertisement
Ads by CJ

గత కొన్నిరోజులుగా ప్రజలు కరెన్సీ కష్టాలు, ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా టెన్షన్‌లో ఉన్నారు. దీంతో ఈ ఏడాది చివరి నెల అయిన డిసెంబర్‌ను నవ్వుల నెలగా మార్చడానికి మన కమెడియన్లు, దర్శకనిర్మాతలు రెడీ అయిపోతున్నారు. రేపు అంటే 16వ తేదీన పృథ్వీ ముఖ్యపాత్రను పోషిస్తోన్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి గతంలో అల్లరి నరేష్‌..శ్రీకాంత్‌లతో పలు కామెడీ హిట్స్‌ను అందించిన ఇ.వి.వి.సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో పృథ్వీ కామెడీ సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. ఇక డిసెంబర్‌ 23న స్టార్‌ కమెడియన్‌గా ఎదుగుతున్న సప్తగిరి హీరోగా నటిస్తున్న'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' విడుదల కానుంది. 

కాగా ఈ చిత్రం ఆడియోను పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ విడుదల చేయడం, ట్రైలర్స్‌లో తన డ్యాన్స్‌లు, నటనతో అదరగొడుతున్న సప్తగిరి కామెడీ ఈ చిత్రానికి మేజర్‌ ఎస్సెట్స్‌ అంటున్నారు. దీంతో ఈ చిత్రం కూడా మంచి అంచనాలను రేకెత్తిస్తోంది. ఇక నవంబర్‌లోనే విడుదల కావాల్సి వుండి, మోదీ ఎఫెక్ట్‌ వల్ల విడుదల ఆలస్యమైన అల్లరి నరేష్‌ చిత్రం 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం' డిసెంబర్‌ 30న విడుదలై ఈ ఏడాదికి ఘనంగా వీడ్కోలు చెప్పడానికి రెడీ అవుతోంది. కామెడీ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి ఈ చిత్రానికి డైరెక్షన్‌ చేస్తుండటం, భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాణ విలువలు ఈ చిత్రానికి ప్లస్‌ పాయింట్‌ కానున్నాయి. కాగా గత కొంత కాలంగా హిట్‌కు మొహం వాచిపోయి కెరీర్‌లో డేంజర్‌ బెల్స్‌ మోగుతోన్న అల్లరోడికి ఈ చిత్ర విజయం చాలా కీలకంగా మారనుంది. ఈ చిత్రం రిజల్ట్‌పైనే అల్లరోడి భవిష్యత్తు ఆఢారపడి ఉందని చెప్పవచ్చు. నేడు హర్రర్‌ కామెడీ చిత్రాలు మంచి ఆదరణను సాధిస్తున్న ట్రెండ్‌ నడుస్తోంది. దీంతో ఈ చిత్రం అదే జోనర్‌కు చెందిన చిత్రం కావడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ