Advertisementt

యంగ్‌టైగర్‌ చిత్రంలో ఈ వార్తలు నిజమేనా..?

Thu 15th Dec 2016 04:40 PM
jr ntr,dierctor babi,ntr babi combination movie,three hreoines,kajal first heroine,second heroine anupama,third heroine nivetha,ntr triple role movie  యంగ్‌టైగర్‌ చిత్రంలో ఈ వార్తలు నిజమేనా..?
యంగ్‌టైగర్‌ చిత్రంలో ఈ వార్తలు నిజమేనా..?
Advertisement
Ads by CJ

'జనతాగ్యారేజ్‌' వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత ఎన్టీఆర్‌ మూడునెలలకు పైగా సమయం తీసుకుని, తాజాగా 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌' వంటి డిజాస్టర్‌ ఇచ్చిన బాబికి ఓకే చెప్పాడు. ఆయన మొదటి చిత్రం 'పవర్‌' కూడా కేవలం ఓకే అనింపించుకుంది. మరి ఎన్నో కథలు, ఎందరో దర్శకులను కాదని బాబికి ఎన్టీఆర్‌ చాన్స్‌ ఇచ్చాడంటే ఆ చిత్ర కథలో ఏదో విశేషం ఉందని అర్దమవుతోంది.

అందునా ఈమధ్య కాలంలో కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న యంగ్‌టైగర్‌ ఈ చిత్రం ఒప్పుకోవడంతో ఈ వార్తలు నిజమేనని నమ్మాల్సివస్తోంది. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ మూడు విభిన్న పాత్రల్లో ట్రిపుల్‌ రోల్‌ చేయనున్నాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉందిట. మెయిన్‌ హీరోయిన్‌గా తనకు అచ్చి వచ్చిన కాజల్‌ను తీసుకోవాలని ఎన్టీఆర్‌ భావిస్తున్నాడట. ఇక మలయాళ 'ప్రేమమ్‌'తో వెలుగులోకి వచ్చి తెలుగులో 'అ....ఆ'. 'ప్రేమమ్‌' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్‌.

ప్రస్తుతం ఆమె దిల్‌రాజు నిర్మాతగా శర్వానంద్‌ హీరోగా సంక్రాంతి కానుకగా విడుదలకానున్న 'శతమానం భవతి' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈమెను సెకండ్‌ హీరోయిన్‌ పాత్రకు పరిశీలిస్తున్నారు. ఇక మూడో పాత్రకు నానితో 'జెంటిల్‌మన్‌' చిత్రంతో ఆకట్టుకున్న నివేదాథామస్‌ పేరు ప్రచారంలోకి వచ్చింది. మరి ఈ వార్తలే నిజమైతే ఇక అనుపమ, నివేథాల జాతకం మారిపోవడం ఖాయమంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ