Advertisementt

అఖిల్, శ్రీయా ల గురించి షాకింగ్ న్యూస్..!

Thu 15th Dec 2016 01:05 PM
akhil,shreya bhoopal,age problem,akhil and shreya bhoopal age,sachin  అఖిల్, శ్రీయా ల గురించి షాకింగ్ న్యూస్..!
అఖిల్, శ్రీయా ల గురించి షాకింగ్ న్యూస్..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకే సంవత్సరంలో  అక్కినేని వారసులిద్దరూ  పెళ్లిపీటలెక్కుతున్నారు. ముందుగా నాగ చైతన్య - సమంత ల పెళ్లి ఉంటుందనుకున్న జనాలకు అఖిల్ ముందుగా లైన్ లో కొచ్చి షాక్ ఇచ్చాడు. నాగ చైతన్య - సమంత ల ప్రేమాయణం జనాలకు బహిర్గతమయ్యాక అఖిల్ - శ్రీయ భూపాల్ వ్యవహారం కూడా ఓపెన్ అయిపొయింది. అన్నదమ్ములిద్దరూ ఒకేసారి ప్రేమలో పడి నాగార్జునకి పెద్ద షాకే ఇచ్చారు. ఇక నాగార్జున కూడా వీరి ప్రేమను ఒప్పుకుని నాగ చైతన్య, సమంత ల పెళ్లి అఖిల్, శ్రీయ ల పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.

అయితే నాగ చైతన్య, సమంతలు మాకు పెళ్లి చేసుకోవడానికి కొంచెం టైమ్ కావాలని అడగడంతో నాగార్జున చేసేది లేక ముందుగా అఖిల్  నిశ్చితార్థం, పెళ్లి చేసేస్తున్నాడు. అయితే ముందుగా అఖిల్ పెళ్లి చేసుకోవడం గురుంచి ఇండస్ట్రీలో రక రకాల పుకార్లు బయలుదేరాయి. ఇక సోషల్ మీడియాలో కూడా రక రకాల రూమర్స్ ప్రచారం లోకి వచ్చాయి. అవన్నీ అలా ఉంటే ఇప్పుడు అఖిల్, శ్రీయ భూపాల్ గురించి ఒక హాట్ న్యూస్ బయటికి వచ్చింది. 

అదేమిటంటే అఖిల్ కంటే శ్రీయ భూపాల్ 5  సంవత్సరాలు పెద్దదని. అఖిల్ కంటే శ్రీయ పెద్దదనే విషయం వారి ఎంగేజ్మెంట్ లో ఎవరిమాటల్లోనో  తెలిసిందనే విషయం ఇప్పుడు హాట్ హాట్ గా ప్రచారం అవుతుంది. అందుకే నాగార్జున తొందరపడి అఖిల్ పెళ్లి చేసేస్తున్నాడని సోషల్ మీడియాలో ఒకటే  ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ భర్తల కంటే భార్యలు వయసులో పెద్ద, చిన్న అనేది కాదు..ఎటువంటి అరమరికలు లేకుండా హాయిగా సంసారం  చేసుకుంటే చాలు అనేదే విషయం.  వయసు విషయం అసలు లెక్కలోనే ఉండదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉదాహరణగా క్రికెట్ దిగ్గజం సచిన్ ఉండనే వున్నాడు. సచిన్ తనకన్నా వయసులో పెద్దదైన అంజలిని పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నాడుగా అని అంటున్నారు చాలామంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ