Advertisementt

మల్లీశ్వరి..కలాం సినిమాలకు సన్నాహాలు..!

Thu 15th Dec 2016 11:54 AM
producer anil sunkara,a. p. j. abdul kalam,karanam malleshwari,dr abdul kalam movie titel,covert telugu english and hindi langauges  మల్లీశ్వరి..కలాం సినిమాలకు సన్నాహాలు..!
మల్లీశ్వరి..కలాం సినిమాలకు సన్నాహాలు..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్స్‌ హవా కొనసాగుతోంది. తాజాగా తెలుగు తేజం, భారత మహిళా వెయిట్‌లిఫ్టర్‌ కరణం మల్లీశ్వరి జీవిత చరిత్రను కూడా బాలీవుడ్‌లో బయోపిక్‌గా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఆల్‌రెడీ కరణం మల్లీశ్వరి పర్మిషన్‌ తీసుకున్న ఓ దర్శకుడు ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మల్లీశ్వరిగా బాలీవుడ్‌ నటి సోనాక్షిసిన్పా నటించే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని పలు ప్రాంతీయ భాషల్లో కూడా డబ్‌ చేయనున్నారు.

మరోపక్క ప్రముఖ తెలుగు నిర్మాత అనిల్‌ సుంకర శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం జీవిత చరిత్రను బయోపిక్‌గా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అతి పేద కుటుంబం నుంచి శాస్రవేత్తగా, దేశానికి రాష్ట్రపతిగా ఆయన ఎదిగిన తీరు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తుందని భావిస్తున్న నిర్మాత ఈ చిత్రానికి 'డాక్టర్‌ అబ్దుల్‌కలాం' అనే టైటిల్‌ను పెట్టి, ఇంగ్లీషులో దీనిని నిర్మించనున్నాడు. ఈ చిత్రాన్ని కూడా హిందీతో పాటు పలు భాషల్లో డబ్‌ చేయనున్నారు. మరి ఈ రెండు బయోపిక్స్‌ ఎలాంటి విజయాలను సాధిస్తాయో వేచిచూడాల్సివుంది....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ