కమల్‌హాసన్.. దేశం గర్వించదగ్గ నటుడు. ఇక సినిమాలలోలాగానే ఆయన నిజజీవితంలో కూడా పలు మందితో కలిసి జీవిస్తుంటాడు. వాణిగణపతిని పెళ్లి చేసుకొని, ఆ తర్వాత తన సహచర నటి సారికను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరిద్దరికి పుట్టిన పిల్లలే శృతిహాసన్, అక్షరహాసన్. కానీ ఈ బంధం కూడా త్వరగానే తెగిపోయింది. ఆ తర్వాత మరో సినీనటి గౌతమితో 13ఏళ్ల పాటు సహజీవనం చేశాడు. తాజాగా గౌతమి కూడా కమల్ నుండి విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇన్‌డైరెక్ట్‌గా కమల్ ప్రవర్తనను తప్పుపట్టారు. కమల్‌తో కలిసి ఉన్న చివరిరోజులు ఎంతో భారంగా నడిచాయని, రోజూ తీవ్ర బాధను క్షణక్షణం అనుభవించానని తెలిపింది. రోజూ ఉదయాన్నే లేవగానే ఈ రోజు ఎంతో బాగా ఉండాలని, భవిష్యత్తు కూడా సంతోషంగా గడపాలని అనిపించాలి గానీ, ఈ రోజు ఎంత బాధగా గడుస్తుందా? అని భయపడే పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని కోరుకుంటునానన్నారు. అలాగని నేను కమల్‌ను తప్పుపట్టడం లేదు. ఆయనపై నాకు కోపం, కక్ష్య లేవు. అవే ఉంటే మేమిద్దరం ఇంత హుందాగా విడిపోయేవారిమి కాదని తెలిపింది. పరిస్థితులు చక్కబడతాయని కొన్నిరోజులు నాకు నేనే చాన్స్ ఇచ్చుకున్నాను. కానీ పరిస్థితులు మారలేదు. ఇద్దరి అభిప్రాయాలు, దారి వేరు వేరుగా ఉన్నప్పుడు విడిపోవడమే మేలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. కాగా వీరిద్దరి మద్య ఉన్న అభిప్రాయభేదాలు జయ మరణం తర్వాత స్పష్టంగా బయటపడ్డాయి. గౌతమి రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండాలని భావించారు. దాంతో చారిటీ పేరుతో ప్రధాని మోదీని, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులను కలిశారు. జయ మరణం తర్వాత కమల్ కనీసం బాధను వ్యక్తం చేయకుండా 'ఆమెపై ఆధారపడి జీవిస్తున్న వారికి నా సానుభూతి' అని వెటకారంగా ట్వీట్ చేయగా, గౌతమి మాత్రం జయ మరణంతో కంటనీరు పెట్టుకొని, ఆమెది సహజమరణం కాదని, ఆమె మరణంపై దర్యాప్తు చేయాలని ప్రధానికి లేఖ రాసింది. ఈ ఒక్క పరిణామంతో వారిద్దరి మధ్య విభేధాలకు కారణం స్పష్టమైపోయింది.