Advertisementt

హీరో లేదా డైరెక్టర్ క్లారిటీ ఇవ్వాల్సిందేనా..!

Tue 13th Dec 2016 08:05 PM
chiranjeevi,director surender reddy,mega star 151 movie,dhruva movie,ram charan,allu aravind producer,geetha arts banner  హీరో లేదా డైరెక్టర్ క్లారిటీ ఇవ్వాల్సిందేనా..!
హీరో లేదా డైరెక్టర్ క్లారిటీ ఇవ్వాల్సిందేనా..!
Advertisement
Ads by CJ

'ధృవ' చిత్రం గత శుక్రవారం విడుదలై థియేటర్స్ లో దూసుకుపోతుంది. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సురేందర్ రెడ్డికి ఈ చిత్ర విజయం మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే ఇప్పుడు సురేందర్ రెడ్డికి మళ్లీ మెగా అవకాశం తలుపుతట్టేలా వుంది. ఈ 'ధృవ' విజయంతో మెగా స్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయని అంటున్నారు.

ఇప్పటికే 'ధృవ' ప్రమోషన్స్ లో భాగంగా సురేందర్ రెడ్డి చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే అప్పుడు 'ధృవ' రిలీజ్ అవ్వలేదు... రిలీజ్ అయ్యాక అది హిట్ అయితే గనక సురేందర్ రెడ్డి కి చిరు ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తుంది లేకపోతె ఖాళీ అని అనుకున్నారు. ఇక ఇప్పుడు 'ధృవ' సూపర్ హిట్ అయ్యింది కాబట్టి సురేందర్ రెడ్డికి చిరుని డైరెక్ట్ చేసే అవకాశం వరించినట్లే అని చెబుతున్నారు. మరో పక్క అసలు సురేందర్ రెడ్డి చిరుతో భేటీ అయ్యి ఆయనతో సినిమా కమిట్ అయ్యాకే చిరంజీవి ని డైరెక్ట్ చేస్తున్నాని చెప్పినట్లు వార్తలొస్తున్నాయి.

ఇదంతా ఒక ఎత్తయితే అల్లు అరవింద్ 'ధృవ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న టైమ్ లోనే  సురేందర్ రెడ్డిని గీత ఆర్ట్స్ బ్యానేర్ లో మరో సినిమా చేయాల్సిందిగా మాట తీసుకున్నాడనే ప్రచారం కూడ మొదలైంది. ఇక చిరంజీవి - సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే ఉంటుందని అంటున్నారు.  ఇక ఇదంతా నిజమని తేలాలంటే అటు చిరు గాని, ఇటు సురేందర్ రెడ్డి గాని ఎవరో ఒకరు ఈ విషయం పై ఒక క్లారిటీ ఇవ్వాల్సివుంటుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ