Advertisementt

ఇలా హీరోయిన్ ని సస్పెన్స్ లో పెట్టారన్నమాట..!

Tue 13th Dec 2016 03:56 PM
chiranjeevi,kajal,khaidi no 150 movie,drance kajal,december 25th 2016 audio release  ఇలా హీరోయిన్ ని సస్పెన్స్ లో పెట్టారన్నమాట..!
ఇలా హీరోయిన్ ని సస్పెన్స్ లో పెట్టారన్నమాట..!
Advertisement
Ads by CJ

చిరంజీవి ప్రెస్టీజియస్ మూవీ 'ఖైదీ నెంబర్ 150' సంక్రాంతికి రిలీజ్ అవుతుండడంతో  ఈ చిత్రానికి సంబందించిన పబ్లిసిటీపై దృష్టిపెట్టారు. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ ని, టీజర్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఈ నెల 25న ఆడియో వేడుక జరపడానికి సిద్ధంగా వుంది. అయితే ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా నటిస్తున్న కాజల్ లుక్ ని ఎక్కడా బయట పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది చిత్ర యూనిట్. మూవీ ఫస్ట్ లుక్ లో గాని టీజర్ లో గాని కాజల్ ని ఎక్కడా చూపించలేదు.

ఇక కాజల్ మాత్రం 'ఖైదీ నెంబర్ 150' లో తన లుక్ ని ఇంతవరకు బయటపెట్టనందుకుగాను కొంచెం అలక వహించినట్లు వార్తలొస్తున్నాయి. అందుకే కాజల్ తన రీసెంట్ ఫొటోస్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుందట. అయితే ఇప్పుడు కాజల్  'ఖైదీ...' చిత్రం గురించి కొన్ని ముచ్చట్లు చెబుతుంది.  తానూ చిరుగారితో డాన్స్ చేయలేకపోయానని... అంత గ్రేట్ డాన్సర్ తో కలిసి స్టెప్స్ వేసేందుకు చాలా కష్టపడ్డానని...చెప్పుకొచ్చింది. ఇక పాటల షూటింగ్ అప్పుడు చిరుగారు సూచనలతో నా డాన్స్ స్టెప్స్ ని ప్రాక్టీస్ చెయ్యడంతో నా డాన్స్ ల స్వరూపమే మారిపోయిందని... అందుకే ఇప్పుడు నా డాన్స్ లో మంచి గ్రెస్ కనిపిస్తుందని చెప్పుకొచ్చింది.

ఇక 'ఖైదీ...' లో కాజల్ చిరంజీవి పక్కన ఎలా వుండబోతుందో అనే క్యూరియాసిటీని పెంచడానికే కాజల్ లుక్ ఇంతవరకు రివీల్ చెయ్యలేదని చిత్ర యూనిట్ చెబుతుంది. మరి చిరు పక్కన కాజల్ ఎలా ఉందొ చూడాలంటె అభిమానులు సంక్రాంతి వరకు వెయిట్ చెయ్యాల్సిందే అన్నమాట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ