పవన్‌కళ్యాణ్ సంగతి తీసుకుంటే... ఇటు వరుస చిత్రాలతో పాటు పొలిటికల్ మీటింగ్స్, ప్రతిరోజు దేశంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలను విశ్లేషించుకుంటూ, మరోపక్క తన 'జనసేన' ను క్షేత్రస్థాయి నుంచి బలోపేతానికి వ్యూహాలు రచిస్తూ వాటిల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. మరోపక్క మహేష్‌బాబు కూడా వరుస చిత్రాలను లైన్‌లో పెడుతూ, ప్రస్తుతం మురుగదాస్ తీస్తున్న భారీ ద్విభాషా చిత్రం షూటింగ్‌లో గుజరాత్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. కాగా వీరిద్దరు కాస్త విశ్రాంతిని కోరుకుంటున్నారు. సినీ ప్రముఖులకు, మరీ ముఖ్యంగా స్టార్స్‌కు ఒక్క క్షణం తీరిక ఉండదు. వారి బిజీలో ఫ్యామిలీలకు దూరంగా నెలలకు నెలలు గడుపుతుంటారు. కాబట్టి అప్పుడప్పుడు ఆటవిడుపుగా విశ్రాంతికి కోరుకుంటారు. కాగా త్వరలో నూతన ఏడాది సంబరాలు మొదలు కానున్న నేపథ్యంలో ఈ ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ తమ తమ చిత్రాలకు ఓ పదిరోజులు గ్యాప్ ఇచ్చి న్యూఇయర్ సందర్భంగా తమ ఫ్యామిలీలతో కలిసి విదేశీ టూర్లను ప్లాన్ చేస్తున్నారు. మహేష్‌బాబు తన ఫ్యామిలీతో కలిసి లండన్ లేదా దుబాయ్‌లకు వెళ్లనున్నాడు. అదే సమయంలో పవన్ తన భార్య స్వంత దేశమైన ఆస్ట్రేలియాకు ఆమెతో కలిసి వెళ్లి, అక్కడ ఉన్న తన అత్తామామ, ఇతర బంధువులు, స్నేహితులతో గడపాలని ప్లాన్ చేస్తున్నాడట. పనిలో పనిగా ఆస్ట్రేలియాలోని తన అభిమానులను కలిసి తన పార్టీని బలోపేతం చేసే విషయంపై వారితో చర్చించనున్నాడని సమాచారం.