Advertisementt

సమంత కి ఇష్టమైంది ఏది వదలదు..?

Tue 13th Dec 2016 12:52 PM
samantha,naga chaitanya,christmas,christmas tree  సమంత కి ఇష్టమైంది ఏది వదలదు..?
సమంత కి ఇష్టమైంది ఏది వదలదు..?
Advertisement
Ads by CJ

💃💃💃 #myfavttimeofyr got my tree 🌲 up . Now to make it pretty 😎 #christmas #lovetheholidayspirit #eatdrinkndbmerry

నాగ చైతన్య తో ప్రేమ, పెళ్లి అంటూ సమంత లైఫ్ లో చాలా బిజీగా వుంది. అయితే ఈ ప్రేమ, పెళ్లి విషయం కారణంగా సమంత మాత్రం తన కెరీర్ లో బాగా ఖాళీ అయ్యింది. ఆమెకు టాలీవుడ్ లో అసలు అవకాశాలే లేక ఖాళీ గా ఉంటుంది. మరో వైపు తమిళ్ లో రెండు, మూడు సినిమాలు సైన్ చేసిన సామ్ ఇప్పుడు తెలుగులో కూడా ఒక భారీ ఆఫర్ పట్టేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే నాగార్జున కోడలిగా నాగ చైతన్యతో కలిసి పార్టీలకి, పబ్ లకు తిరుగుతున్న సమంత రీసెంట్ గా అక్కినేని కోడలిగా అఖిల్ ఎంగేజ్మెంట్ లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే తనకి నాగార్జున కోడలి అవ్వడం వల్ల అవకాశాలు తగ్గుమొఖం పడతాయని సమంత బాధపడుతున్న సమయంలో ఒక బడా ప్రొడ్యూసర్ ఆమెకి మహానటి సావిత్రి బయో పిక్ లో నటించే ఛాన్స్ ఇచ్చాడని వార్తలు వెలువడ్డాయి. ఇక ఆఫీసియల్ గా అనౌన్సమెంట్ రావడమే తరువాయి. 

ఇక ఇప్పుడు హైదరాబాద్ లో క్రిస్మస్ సందడి నెలకొంది. అయితే  క్రిస్మస్ సందర్భం గా సమంత ఒక క్రిస్మస్ ట్రీ ని డెకరేట్ చేస్తూ ఒక పిక్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. తనకి క్రిస్మస్ అంటే ఎంతో ఇష్టమని.... క్రిస్మస్ ట్రీ అంటే మరీ ఇష్టమని పోస్ట్ చేసింది. ఆ ఫోటో లో సమంత క్రిస్మస్ ట్రీ ని డెకరేట్ చేస్తూ దానికి మెరుగులు దిద్దుతుంది. మరి అక్కినేని కోడలిగారికి క్రిస్మస్ అంటే బోలెడు ఇష్టమట. అప్పుడు చైతూ..ఇప్పుడు క్రిస్టమస్ ట్రి... చూస్తుంటే సమంత కి ఇష్టమైంది ఏది వదలదు..? అని తెలుస్తుంది కదా!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ