ఓవర్‌సీస్‌పై కన్నేసిన రామ్‌చరణ్ 'ధృవ' చిత్రం ప్రమోషన్‌లో బాగంగా అమెరికా వెళ్లి అక్కడ డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులు, ప్రేక్షకులతో మమేకం అవుతూ, అక్కడ వారితో కలిసి 'ధృవ' చిత్రాన్ని తన యూనిట్‌లోని రకుల్‌ప్రీత్, అరవింద్‌స్వామి, దర్శకుడు సురేందర్‌రెడ్డి తదితరులతో కలిసి అక్కడి థియేటర్లలో షోలకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమోషన్ అక్కడ ఈ చిత్రానికి మంచి వసూళ్లు రావడానికి ఎంతగానో దోహదపడుతోంది. కాగా ఆయన అమెరికాలో ఎక్కడికి వెళ్లినా అక్కడి డిస్ట్రిబ్యూటర్లు చరణ్ కోసం ఖర్చుకు వెనుకాడకుండా లగ్జరీ హోటల్ రూమ్స్‌ను బుక్ చేసి ఇస్తూ, ఆయన హోదాకు తగ్గట్లుగా ఖర్చుపెడుతున్నారు. అమెరికాలోని ఏ ప్రాంతానికి వెళ్లినా చరణ్ హోటల్ రూమ్స్‌కే లక్షల కొద్ది డబ్బును మంచినీళ్లప్రాయంగా ఖర్చుపెడుతున్నారు. ఉదాహరణకు ఆయన డల్లాస్‌కు వెళ్లిన సందర్భంగా అక్కడి ఫోర్‌సీనన్స్ హొటల్‌లో చరణ్ కోసం లగ్జరీరూమ్‌ను డిస్ట్రిబ్యూటర్లు బుక్ చేశారు. ఆ హోటల్‌లో చరణ్ గడిపింది కేవలం రెండు గంటలు మాత్రమేనట. కానీ హోటల్ బిల్లు మాత్రం దాదాపు 6లక్షలయింది. ప్రతి చోటా ఇదే పరిస్థితి. కానీ చరణ్ రావడం వల్ల తమకు పెరుగుతున్న కలెక్షన్లను దృష్టిలో పెట్టుకొని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఖర్చుకు వెనుకాడటం లేదని అంటున్నారు.