క్రీడారంగంలోనే కాదు.. సినిమా రంగంలో కూడా డ్రగ్స్‌కు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకున్నవారు కూడా ఎందరో ఉన్నారు. నేటితరం యంగ్‌హీరోల్లో కూడా కొందరు ఇదే బాపతుకు చెందిన వారు ఉన్నారనేది సినీ ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. కాగా వీటిని కొందరు ఆలస్యంగా వెల్లడిస్తారు. తాజాగా నిన్నటితరం హీరో భానుచందర్ కూడా తాను విద్యార్ధిదశలో డ్రగ్స్‌కు బానిసైన విషయాన్ని మీడియా ముందు ఒప్పుకున్నాడు. ఒకప్పుడు సుమన్, భానుచందర్‌లు తెలుగు ప్రేక్షకులను తమ స్టంట్స్‌తో ఉర్రూతలూగించారు. ఇద్దరు మార్షల్స్ ఆర్ట్స్ వచ్చిన వారు కావడంతో వీరి చిత్రాలల్లో ఫైట్స్ విపరీతంగా ఆకట్టుకుని, నాటితరం యాక్షన్, మాస్ చిత్రాల ప్రేక్షకులను రంజింపచేశాయి. ఇక వీరిద్దరి కలిసి కూడా ఎన్నో మల్టీస్టారర్ చిత్రాలు చేశారు. 'మెరుపుదాడి, డాకు, నక్షత్రపోరాటం' వంటి పలు హిట్ చిత్రాలలో కలిసి నటించారు. ఇక సుమన్ హీరోగా తెలుగు తెరకు పరిచయం అయిన 'తరంగిణి' చిత్రంలో భానుచంద్ విలన్ కావడం విశేషం. భానుచందర్ కేవలం హీరోగానే కాదు... విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా మంచి ఫేమ్ సాధించాడు. ఇక ఆయన సోలో హీరోగా నటించిన బాలూమహేంద్ర చిత్రం 'నిరీక్షణ' ఆనాడు సంచలనం సృష్టించింది. ఇక తాజాగా కృష్ణచైతన్య అనే యువహీరో నటిస్తున్న 'స్టూడెంట్ నెంబర్‌వన్' చిత్రంలో భానుచందర్, భానుప్రియలు నటిస్తున్నారు. ఈ సందర్భంగా భానుచందర్ మాట్లాడుతూ, ఈ చిత్రం స్టోరీ నా నిజజీవితానికి ఎంతో దగ్గరగా ఉన్న చిత్రం. నేటి యువతను చదువుకోమని తల్లిదండ్రులు కళాశాలలకు పంపిస్తుంటే, వారు డ్రగ్స్‌తో పాటు పలు దురలవాట్లకు బానిసలవుతున్నారు. నేను కూడా చిన్నప్పుడు ఇలా డ్రగ్స్‌కు బానిసనైన వాడినే. కానీ ఆ తర్వాత మా నాన్నగారు నన్ను మార్షల్‌ఆర్ట్స్‌లో చేర్పించిన తర్వాత వాటికి దూరమయ్యాను.. అంటూ చెప్పుకొచ్చారు. ఇక తాజాగా సిక్స్‌ప్యాక్‌లు, ఎయిట్‌ప్యాక్‌ల కోసం కొందరు హీరోలు స్టెరాయిడ్స్ వాడుతున్నారని సినీజోష్ తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ తన తాజా 'దంగల్' చిత్రం కోసం స్టెరాయిడ్స్ వాడారని విమర్శలు వస్తున్నాయి. అమీర్ పర్సనల్ ట్రెయినర్ కూడా ఈ విషయాన్ని దాదాపు ఖరారు చేయడం సంచలనం సృష్టిస్తోంది.