Advertisementt

ఆ విషయంలో పవన్‌ను..ఎన్టీఆర్‌ మించగలడా..?

Mon 12th Dec 2016 12:18 PM
power star pawan kalyan,jr ntr,director babi,sardaargabbarsingh movie,temper movie,puri,sukumar  ఆ విషయంలో పవన్‌ను..ఎన్టీఆర్‌ మించగలడా..?
ఆ విషయంలో పవన్‌ను..ఎన్టీఆర్‌ మించగలడా..?
Advertisement
Ads by CJ

పవన్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లు ఇద్దరు టాలీవుడ్‌లో ఫాలోయింగ్‌పరంగా మంచి క్రేజ్‌ ఉన్న స్టార్స్‌. ఆ మద్యకాలంలో ఎన్టీఆర్‌ వరుస పరాజయాల నేపథ్యంలో పవన్‌ కంటే ఎన్టీఆర్‌ రేసులో కాస్త వెనుకపడ్డాడు.కానీ 'టెంపర్‌' నుంచి మరలా ఫామ్‌లోకి వచ్చిన ఎన్టీఆర్‌ 'టెంపర్‌, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్‌' వంటి చిత్రాలతో మరలా రేసులోకి వచ్చాడు. గత 30ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో నందమూరి వర్సెస్‌ మెగాఫ్యామిలీలకి ఉన్న ఆధిపత్యపోరు కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంలో ఈ ఇరువురి హీరోల అభిమానులు కూడా బద్దశత్రువులుగా వ్యవహరిస్తుంటారు. ఈ అభిమానుల మధ్య ఉన్న గొడవల కారణంగా ఇటీవల ఓ అభిమాని హత్యకు సైతం గురి కావడం సంచలనం సృష్టించింది. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్‌ పవన్‌కు 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' వంటి డిజాస్టర్‌ను ఇచ్చిన దర్శకుడు బాబికి తన తదుపరి చిత్రానికి దర్శకునిగా అవకాశం ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. నిన్నటివరకు హిట్‌ దర్శకుల వెంట పడతాడనే విమర్శలకు ఆయన పూరీ, సుకుమార్‌, తాజాగా బాబిలకు అవకాశం ఇవ్వడం ద్వారా ఎన్టీఆర్‌ సరైన సమాధానం చెప్పాడు. 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌'కు పవన్‌ అన్నీ తానై వ్యవహరించడం వల్లే ఈ చిత్రం డిజాస్టర్‌ అయిందని, దర్శకునిగా బాబి పేరును వేయడం తప్ప ఆయన పాత్ర ఇందులో ఏమీ లేదని ఎన్టీఆర్‌తో పాటు ఆయన అభిమానులు కూడా భావిస్తున్నారు. అందుకే పవన్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడినే తన చిత్రానికి దర్శకునిగా ఎంచుకొని, ఎన్టీఆర్‌ బాబితో చిత్రాన్ని బ్లాక్‌బస్టర్‌ చేయాలనే పట్టుదలతో ఉన్నట్లు ఎన్టీఆర్‌ కోటరీ ప్రచారం మొదలుపట్టింది. మరి ఈ విషయంలో ఎన్టీఆర్‌ ఎంతవరకు విజయం సాధించగలడనే విషయం ఇప్పుడు సినీ వర్గాల్లోనే కాక సినీ అభిమానుల్లో కూడా చర్చనీయాంశం అయింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ