బాలీవుడ్‌లో స్టార్‌హీరోల కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న టాప్ హీరోయిన్లు దీపికాపడుకొనే, ప్రియాంకాచోప్రా. వీరిద్దరు ప్రస్తుతం హాలీవుడ్ బాట పట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీపికా నటిస్తోన్న 'ట్ర్రిపుల్ ఎక్స్' చిత్రం టీజర్ విడుదలై సంచలనం సృష్టించింది. కానీ ఈ టీజర్‌లో ఆమె కేవలం కొద్ది సెకన్లు మాత్రమే కనిపించింది. ఆ రెండు మూడు సెకన్లలోనే ఆమె తన హాట్‌లుక్స్‌తో హీట్ పుట్టించింది. ఈ చిత్రంలో ఆమె పలు యాక్షన్ సీన్స్ చేయనుంది. దీంతో ఆమెపై ఎక్కువ ఫోకస్ పెడుతూ త్వరలో మరో టీజర్ విడుదల కానుంది. ఇక ప్రియాంకాచోప్రాది కూడా అదే దారి. ఆమె 'బేవాచ్' సిరీస్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో హీరోగా డ్వేన్‌జాన్సన్ నటిస్తున్నాడు. ఈ చిత్రం టీజర్ కూడా తాజాగా విడుదలైంది. మొత్తం 30 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో ప్రియాంకా కనిపించింది కూడా కేవలం మూడుసెకన్లే. అయితే ఈ మూడుసెకన్లలోనే ఆమె తన క్లీవేజ్ షోతో మతులు పోగొడుతోంది. కాగా ఈ చిత్రంలో ఆమె మెయిన్ విలన్ క్యారెక్టర్‌ను పోషించనుండటం విశేషం. త్వరలో ఆమెపై కూడా ఓ ప్రత్యేక టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మేలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరి ఈ రెండు చిత్రాలు హిట్ అయితే ఈ ఇద్దరు ముద్దుగుమ్మలను భారతీయ సినీ పరిశ్రమ మర్చిపోవాల్సిందే. ఎందుకంటే ఈ చిత్రాలు సక్సెస్ అయితే ఇక వారు హాలీవుడ్‌లోనే తమ కెరీర్‌ను కొనసాగించాలని కోరుకుంటున్నారు.సో.. వారు ఇండియన్ స్క్రీన్ మీద కనిపించకపోయిన హాలీవుడ్ చిత్రాల ద్వారా మాత్రం మన మతులను పొగొట్టకుండా ఉండరు కదా..!