Advertisementt

ఇక సమంత సినిమాలకు దూరమౌతుందా..?

Sun 11th Dec 2016 04:12 PM
samantha,naga chitanya,nagarjuna,akhil,naga chautanya samantha marriage,samantha marriage after she is not acting,director nag aswin,mahanati movie  ఇక సమంత సినిమాలకు దూరమౌతుందా..?
ఇక సమంత సినిమాలకు దూరమౌతుందా..?
Advertisement

పెళ్లి ఇంకా కాలేదన్నమాటే గానీ నాగచైతన్య, సమంతల జంట పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు కలిసే వెలుతున్నారు. ఇక వీరిద్దరి నిశ్చితార్ధం ఎప్పుడనేది మాత్రమే తెలియడం లేదు. ఇప్పటికే అఖిల్‌ నిశ్చితార్ధం జరిగిపోయింది. ఈయన పెళ్లి వచ్చే ఏడాది మేలో ఉంటుందంటున్నారు. ఇక చైతు-సమంతల పెళ్లి ఆగష్టులో ఉంటుందని సమాచారం. కాగా కెరీర్‌పరంగా చూసుకుంటే 'ఏమాయచేశావే'తో దాదాపు చైతూ, సమంతలు ఒకేసారి కెరీర్‌ మొదలుపెట్టారు. అంతకు ముందు చైతూ కేవలం ఒకే ఒక్క చిత్రం చేశాడు. ఇప్పటివరకు కెరీర్‌పరంగా చూసుకుంటే చైతూ కంటే సమంతనే టాప్‌లో ఉంది. ఆమె ఇప్పటికే దాదాపు అందరూ యంగ్‌స్టార్స్‌ సరసన నటించేసింది. పలు పెర్ఫార్మెన్స్‌ ఓరియంటెడ్‌ చిత్రాలు కూడా చేసి, నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పటికీ ఆమెనే తమ తమ చిత్రాలలో తీసుకోవాలని పలువురు దర్శకనిర్మాతలు, ఆమెతో కలిసి నటించాలని హీరోలు ఆశపడుతున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా ఆమె నటించే విషయాన్ని ఆమె నిర్ణయానికే వదిలేశాడు చైతూ. అయితే చైతూ-సమంతల పెళ్లి వార్తలు వచ్చిన మొదట్లో నాగార్జున మాత్రం సమంత వివాహం తర్వాత నటించడానికి ఇష్టపడటం లేదనే వార్తలు వచ్చాయి. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంతను ఇదే ప్రశ్న అడిగితే.. నేను నటించడం నాగార్జునగారికి కూడా ఇష్టమే, నేను నటించడం మానేస్తే ఎక్కువగా బాధపడేది ఆయనేనంటూ క్లారిటీ ఇచ్చింది. కానీ ఇండస్ట్రీలోని పలువురు మాత్రం పెళ్లికి ముందు అంతా బాగానే ఉంటుందని, కానీ పెళ్లయిన తర్వాత మాత్రం అలాంటి పరిస్థితులు ఉండవంటున్నారు. ఇందుకు ఉదాహరణగా వారు నాగార్జున భార్య అమలను ఉదాహరణగా చెబుతున్నారు. కారణాలు ఏవైనా పెళ్లయిన తర్వాత అమల నటనకు దాదాపు గుడ్‌బై చెప్పేసింది. బ్లూక్రాస్‌ సొసైటీ ద్వారా జంతు హక్కుల పోరాటంలో యాక్టివ్‌గా ఉంటోంది. ఇక సమంత విషయానికి వస్తే ఆమెకు కూడా సామాజిక స్పృహ చాలా ఎక్కువ. హుద్‌హుథ్‌ తుపాను సమయంలో ఆమె ఇతర హీరోలకు ధీటుగా 15లక్షల విరాళం అందించింది. అలాగే ఆమె ఓ చారిటబుల్‌ ట్రస్ట్‌ను కూడా నడుపుతోంది. దీని ద్వారా దాదాపు 65మంది అనాథలకు సహాయం చేస్తోంది. క్రిస్టియన్‌ కావడంతో ఆమె మిషనరీలకు కూడా బాగానే విరాళాలు ఇస్తుంటుంది. కాగా సమంతకు స్వతంత్రభావాలు ఎక్కువ. కాగా ఆమె ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను అక్కినేని ఫ్యామిలీ కోడలిని కానున్నానని తెలియడంతో యాడ్స్‌ రావడం తగ్గిపోయాయని, తాను కూడా ఇక వాటిల్లో నటించకూడదని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇక ఈ వివాహం సంగతి తెలిసిన తర్వాత తనకు తెలుగులో సినిమా అవకాశాలు రావడం కూడా తగ్గిపోయాయన్న వాస్తవాన్ని కూడా ఆమె అంగీకరించింది. కాగా ప్రస్తుతం ఆమె తమిళంలో విశాల్‌, విజయ్‌సేతుపతి, శివకార్తికేయన్‌ల చిత్రాలలో నటిస్తోంది. మొత్తానికి ఆమెకు నటించాలని ఉన్నా, అందుకు చైతు, నాగ్‌లు అభ్యంతరం చెప్పకపోయినా కూడా ఆమెకు సినిమా అవకాశాలు ఇవ్వడానికి అందరూ జంకుతారు. అందునా ఆమె అటు అక్కినేని కుటుంబానికి, దగ్గుబాటి కుటుంబానికి కూడా చైతూ మనవడు. దాంతో ఆమె సినిమాల్లో నటించాలని భావించినా ఆయా ఫ్యామిలీల అభిమానులు మాత్రం ఆమెపై ఒత్తిడి తేవడం ఖాయమంటున్నారు. అందువల్ల ఇకపై ఆమె తెలుగులో నటించినా కూడా కేవలం నిండైన పాత్రలనే చేయల్సివస్తుంది తప్పితే గ్లామర్‌ పాత్రలు మాత్రం ఇక ఆమె చేసే అవకాశం లేదన్నది మాత్రం అక్షరసత్యం. ఇక తాజాగా సమంత త్వరలో తనకు నచ్చిన పాత్రలు తెలుగులో రావడం లేదని, తాజాగా అలాంటివి వచ్చాయని, వాటిని ఎప్పుడు అనౌన్స్‌ చేస్తారా? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ట్వీట్‌ చేసింది. ఆమెకు మహానటి సావిత్రి బయోపిక్‌లో ఆ మహానటి పాత్రను పోషించే అవకాశం వచ్చిందని సమాచారం. 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్రం ద్వారా టాలెంటెడ్‌ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న నాగ్‌అశ్విన్‌ ఇప్పటివరకు ఎంతో రీసెర్చి చేసి సావిత్రి కథను తయారుచేసి, ఆ పాత్రకు సమంతను ఎంచుకున్నాడని సమాచారం. ఈ చిత్రాన్ని అశ్వనీదత్‌ కుమార్తెలు నిర్మిస్తున్నారు. కాగా చైతు-సమంతల వివాహం హైదరాబాద్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం, చెన్నైలో క్రిస్టయన్‌ మతానుసారం జరగనున్నాయని సమాచారం. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement