Advertisementt

ధృవ విలన్ తో ఇప్పుడు హాట్ బ్యూటీ..!

Sun 11th Dec 2016 12:35 PM
dhruva,aravind swamy,tamanna,tamanna for aravind swamy,selva  ధృవ విలన్ తో ఇప్పుడు హాట్ బ్యూటీ..!
ధృవ విలన్ తో ఇప్పుడు హాట్ బ్యూటీ..!
Advertisement
Ads by CJ

తెలుగులో స్టార్‌ హీరోల చిత్రాలలో ఆచితూచి నటిస్తున్న మిల్కీబ్యూటీ తమన్నా కోలీవుడ్‌లో మాత్రం డేరింగ్‌ నిర్ణయాలు తీసుకుంటోంది. తెలుగులో సీనియర్‌ స్టార్స్‌తో  చేస్తే యంగ్‌ స్టార్స్‌ చిత్రాలలో తీసుకోవడానికి మన దర్శకనిర్మాతలు, యంగ్‌స్టార్స్‌ కూడా భయపడుతున్నారు. కానీ కోలీవుడ్‌లో అలాంటి సెంటిమెంట్లు ఏమీలేవు. దీంతో స్టార్‌ హీరోయిన్స్‌ కూడా సీనియర్‌ హీరోల చిత్రాలలోని పాత్రలు నచ్చితే ఒప్పుకుంటున్నారు. దాంతో కోలీవుడ్‌ పరిశ్రమ టాలెంట్‌ చూపించాలని భావించే హీరోయిన్లకు స్వర్గదామంగా మారుతోంది. ఇటీవల ఆమె తమిళంలో నటించిన 'ధర్మదురై', 'దేవి' చిత్రాలు విజయాలను సాధించాయి. విశాల్‌తో చేస్తున్న 'కత్తి సందై' చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. తాజాగా ఆమె శింబుతో నటిస్తున్న చిత్రం సెట్స్‌పై ఉండగానే, సీనియర్‌ హీరో అరవింద్‌స్వామి సరసన కూడా ఈమె ఛాన్స్‌ కొట్టేసింది. రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తన వయసుకు తగ్గ పాత్రలనే ఎంచుకుంటున్న స్వామి ఓ వైపు విలన్‌ పాత్రలను చేస్తూనే, మరో వైపు హీరో పాత్రలకు కూడా సై అంటున్నాడు. ఆయన హీరోగా సెల్వ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా తమన్నాను ఎంపిక చేశారు. ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా 'తని ఒరువన్‌' తెలుగు రీమేక్‌ 'ధృవ'లో కూడా విలన్‌గా అదే పాత్రను చేసి టాలీవుడ్‌ ఆడియన్స్‌ను తన స్టైలిష్‌ లుక్‌, యాక్టింగ్‌తో మెస్మరైజ్‌ చేసిన అరవింద్‌స్వామి.. తమన్నాతో నటించే చిత్రం తెలుగులోకి కూడా డబ్‌ కానుందని సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ