Advertisementt

ఒక్క హిట్ కె ఆకాశం ఎక్కేసిందిగా..!

Sun 11th Dec 2016 11:14 AM
heroine sai pallavi,premam movie,director shekhar kammula,fida movie,hero varun tej,mani ratnam  ఒక్క హిట్ కె ఆకాశం ఎక్కేసిందిగా..!
ఒక్క హిట్ కె ఆకాశం ఎక్కేసిందిగా..!
Advertisement
Ads by CJ

మలయాళంలో 'ప్రేమమ్' మూవీ సూపర్ హిట్ సాధించింది. ఆ సినిమాలో నటించిన నటీనటులకు గుర్తింపు రావడమే కాదు మంచి అవకాశాలను సొంతం చేసుకున్నారు. ఆ సినిమాలో నటించిన మలయాళ బ్యూటి సాయి పల్లవి పేరు మాత్రం ఒకింత ఎక్కువగా మారుమోగిపోయింది. ఇక ఆమెకు అవకాశాలు కూడా వెల్లువలా వచ్చిపడ్డాయి. కానీ ఆ అవకాశాలు మాత్రం పట్టాలెక్కలేదు. ఇప్పుడు సాయి పల్లవి పరిస్థితి ఏమిటో అర్ధం కాకుండా పోయిందనే ప్రచారం మొదలైంది. 

తెలుగులో మొదలు కాబోయే సినిమాలకు సాయి పల్లవి పేరును కొంతమంది హీరోలకు జత చేసి ఆమె ఆ హీరో పక్కన నటిస్తుంది.... ఆమె ఈ హీరో పక్కన నటిస్తుంది అని తెగ ప్రచారం జరిగింది. కానీ ఆమెకు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. ఇక తమిళంలో  కూడా సాయి పల్లవి మణిరత్నం మూవీలో కార్తీకి జోడిగా నటిస్తుంది అని అనుకున్నప్పటికీ మణిరత్నం మాత్రం అదితీరావ్ హైదరీని తన సినిమా హీరోయిన్ గా సలెక్ట్ చేసుకున్నాడు. ఇక అలాగే గౌతమ్ మీనన్ సినిమాలో సాయి పల్లవికి అవకాశం వచ్చిందని అన్నారు కానీ అందులోను గౌతమ్ మరో హీరోయిన్ ని తీసుకున్నాడని వార్తలొస్తున్నాయి. 

అయితే ఇప్పుడు తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న 'ఫిదా' లో నటిస్తుంది. ఇక ఈ చిత్రం తప్ప సాయి చేతిలో మరో సినిమా లేదు. అయితే ఆమెకు అవకాశాలు వరించకపోవడానికి కారణం మాత్రం ఆమె అడిగే పారితోషకం అంటున్నారు. ఆమె మరీ ఎక్కువగా డిమాండ్ చెయ్యడం వల్లే ఆమెకు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయని అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ