Advertisementt

అమీర్ ఖాన్ అడిగితే రజినీకాంత్..కాదన్నాడు..!

Sat 10th Dec 2016 12:12 PM
  అమీర్ ఖాన్ అడిగితే రజినీకాంత్..కాదన్నాడు..!
అమీర్ ఖాన్ అడిగితే రజినీకాంత్..కాదన్నాడు..!
Advertisement
Ads by CJ

అమీర్  ఖాన్ తాజా చిత్రం 'దంగల్' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి  సంబందించిన ట్రైలర్ యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ 'దంగల్' చిత్రం 2010 కామన్వెల్త్‌ గేమ్స్‌లో మంచి ప్రతిభ కనబర్చిన రెజర్లు గీతా పొగట్‌, బబితా కుమారి లను తీర్చిదిద్దిన వారి తండ్రి మహావీర్‌ సింగ్‌ పొగాట్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్క్కిస్తున్నారు. ఇక గీతా పొగట్‌, బబితా కుమారి లు ఇరువురు 2010 కామన్వెల్త్‌ గేమ్స్‌ లో ఒకరు బంగారు పథకాన్ని మరొకరు కాంస్య పథకాన్ని సాధించారు.

అయితే అమీర్ ఖాన్ దంగల్ చిత్రాన్ని అనేక భాషల్లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు జరుపున్నాడట. అన్ని భాషలతో పాటే తమిళంలో కూడా ఈ చిత్రాన్ని డబ్ చేసి భారీ లెవల్లో విడుదల చెయ్యాలని చూస్తున్నాడట. ఇక తమిళంలో తన పాత్రకు సూపర్ స్టార్ రజినీకాంత్ చేత డబ్బింగ్ గనక చెప్పిస్తే ఈ దంగల్ చిత్రం పై మరింత అంచనాలు పెరిగే అవకాశం ఉందని భావించిన అమీర్ రజినిని కలిసి తన దంగల్ చిత్రాన్ని స్పెషల్ షో వేసి మరీ ఆయనకి చూపించాడట. ఇక తన పాత్రకు డబ్బింగ్ చెప్పమని రజినీ ని కోరగా ఆ కోరికను రజినీ సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలొస్తున్నాయి. ఇక దంగల్ చిత్రాన్ని తిలకించిన రజినీ సినిమా చాలా బావుందని అమీర్ ని మెచ్చుకున్నాడట.

అయితే ఇప్పుడు కోలీవుడ్ లో దంగల్  సినిమా అంత బావుంటే అమీర్ పాత్రకు రజినీ డబ్బింగ్ చెప్పకపోవడానికి కారణమేమిటో అని అందరూ తెగ చర్చించుకుంటున్నారట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ