రాఘవేంద్రరావు ఏ జోనర్ లో సినిమా తీసిన దానిలో రొమాన్స్ అనే దానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తాడు. భక్తిరస చిత్రమైన దానిలో రొమాన్స్ కి ప్లేస్ ఇస్తూనే భక్తితో సినిమాలు చేసేస్తాడు. ఇక ఇప్పుడు తాజాగా రాఘవేంద్రరావు, నాగార్జునని వెంకటేశ్వర స్వామి భక్తుడైన హాథిరామ్ బాబాగా చూపిస్తూ 'ఓం నమో వేంకటేశాయ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం లో అనుష్క కూడా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇక ప్రగ్యా జైస్వాల్ కూడా మరో ప్రధాన పాత్రలో నాగార్జున కు జోడిగా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబందించిన రెండు స్టిల్స్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఇక ఈ స్టిల్స్ కి సంబంధించి ఒకదానిలో నాగార్జున, ప్రగ్యా జైస్వాల్ జంటను అత్యంత అద్భుతంగా చూపించాడు దర్శకుడు. వారిద్దరిని అలా చూస్తుంటే భగ్న ప్రేమికుల్లా కనిపిస్తున్నారు. అయితే ఈ 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం భక్తి రస చిత్రంగా తెరకెక్కుతుంది కాబట్టి నాగార్జునని చాలా అందంగా వున్న బాబాగా చూపించాడు. అలాగే ప్రగ్యాని కూడా అత్యంత అద్భుతంగా చూపించి వీరి జంట సూపర్ అనిపించాడు. అయితే ఈ చిత్రంలో కేవలం భక్తి ని మాత్రమే చూపిస్తాడని అనుకుంటున్న ప్రేక్షకులకి నాగార్జునని ఇలా చూపించి ఆ చిత్రం పై భారీ అంచనాలు పెంచేసాడు రాఘవేంద్రుడు. ఇక ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న విడుదల చేస్తున్నామని అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు.