Advertisementt

క్రిష్ కథ ఆ హీరోకి కరెక్ట్ గా సెట్టయిందట..!

Fri 09th Dec 2016 03:26 PM
director krish,gautamiputra satakarni,balakrishna,venkatesh,krish director next movie updates,babu bangaram,guru  క్రిష్ కథ ఆ హీరోకి కరెక్ట్ గా సెట్టయిందట..!
క్రిష్ కథ ఆ హీరోకి కరెక్ట్ గా సెట్టయిందట..!
Advertisement
Ads by CJ

వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్  డైరెక్టర్ క్రిష్. తాను చేసే చిత్రాలు సమాజానికి ఒక మెస్సేజ్ పాస్ చేసే విధంగా ఉండాలని భావించే క్రిష్ 'గమ్యం' దగ్గర నుండి నిన్నమొన్నటి 'కంచె' వరకు అలాంటి చిత్రాలనే డైరెక్ట్ చేసాడు. ఇక ఇప్పుడు బాలకృష్ణ కెరీర్  లో ప్రతిష్టాత్మక 100 వ చిత్రమైన 'గౌతమీపుత్ర శాతకర్ణి' ని డైరెక్ట్ చేస్తున్నాడు క్రిష్. ఇక 'గౌతమీపుత్ర.... 'చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత క్రిష్ చేయబోయే తర్వాత చిత్రం కూడా కన్ఫర్మ్ అయినట్లు వార్తలొస్తున్నాయి.

వెంకటేష్ ఫ్యామిలీ చిత్రాల హీరో. ఆయన ఏ సినిమా అయినా కుటుంబం మొత్తం కలిసి కూర్చుని చూసే విధంగా ఉంటుంది. 'బాబు బంగారం' చిత్రం తర్వాత వెంకీ బాలీవుడ్ రీమేక్ 'గురు' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం మూడు నెలల్లో పూర్తి చేసి విడుదల చేస్తామని సినిమా ప్రారంభం రోజునే చెప్పారు. ఇంకా ఈ 'గురు' చిత్రం  తర్వాత వెంకటేష్ 'నేను శైలజ' ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఇక ఈ చిత్రం పట్టాలెక్కకముందే వెంకటేష్  తన మరో చిత్రాన్ని కూడా లైన్ లో పెట్టాడని చెబుతున్నారు. వెంకీ.. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో మూవీ పూర్తవ్వగానే క్రిష్ డైరెక్షన్ లో నటిస్తాడని ప్రచారం జరుగుతుంది. 

'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం పూర్తికావడంతో క్రిష్ వెంకీ ని కలిసి ఒక కథ వినిపించినట్లు సమాచారం. ఇక ఈ కథ సోషియో ఫాంటసీ కథగా ఉండబోతుందని చెబుతున్నారు. వెంకటేష్ కి ఈ కథ బాగా నచ్చడంతో క్రిష్ తో కలిసి సినిమా చెయ్యడానికి వెంకీ ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక క్రిష్ ఇప్పటికే వెంకీ అన్న కొడుకు రానాతో  ‘కృష్ణం వందే జగద్గురుం' చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. ఈ ‘కృష్ణం వందే జగద్గురుం' చిత్రంలో వెంకీ ఒక పాటలో కనిపించిన సంగతి తెలిసిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ