ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అంటే తెలియని వారుండరు. అంతలా అతను తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించేవాడు. దశాబ్దకాలం పాటు వేణుమాధవ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా హవా కొనసాగించాడు. మధ్యలో హీరోగా సినిమాలు చేసినా... కామెడీకి పెద్ద పీట వేసి కమెడియన్ గానే మిగిలిపోయాడు. అలా కామెడీ చేస్తూ సినిమాల్లో దూసుకుపోతున్న వేణుమాధవ్ ఉన్నట్టుండి సినిమాల్లో కనిపించడం మానేశాడు. అలా కనిపించకుండా పోయిన వేణుమాధవ్ ఆ మధ్యన మీడియా కళ్ళకి చిక్కాడు. అయితే వేణుమాధవ్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అతను బాగా చిక్కిపోయి అసలు రూపం లేకుండా పోయాడు. అలా వేణుమాధవ్ ని చూసిన వారంతా..వేణుమాధవ్ కి ఏదో హెల్త్ ప్రాబ్లెమ్ ఉందని.. అందుకే సినిమాలకు దూరమయ్యాడని ప్రచారం జరిగింది.
సడెన్ గా ఒకసారి వేణుమాధవ్ చనిపోయాడనే వార్తలు ప్రచురితమయ్యాయి. ఆ వార్తలు చూసిన వేణుమాధవ్ నేను బ్రతికే వున్నానని మీడియా ముందుకు వచ్చి మరీ నిరూపించుకోవాల్సి వచ్చింది. ఇలాంటి వార్తలు ఎందుకు సృష్టిస్తారో అని తెగ బాధపడ్డాడు. ఆతర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు వేణుమాధవ్ మీడియా ముఖంగా తనకి బలుపెక్కువని.....ఈగో కూడా కొంచెం ఎక్కువని చెబుతున్నాడు. తనని ఇండస్ట్రీలో ఎవరూ భయపెట్టలేదని, అలాగే నేనేమి రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుని ముఖం చాటెయ్యలేదని, కానీ నాకు బోలెడు ఎఫైర్స్ ఉన్నాయని... ఇలా మాట్లాడితే ఆఫర్స్ రావని కూడా తెలుసునని చెప్పుకొచ్చాడు. అయినా మీడియాలో ఎప్పుడూ హడావిడి చెయ్యడం తనకి చేతకాదని చెప్పాడు.
అంతేకాకుండా తనపై వచ్చిన ఆరోపణలకు చెక్ పెట్టె ప్రయత్నం చేసాడు వేణుమాధవ్. మరి వేణు మాధవ్ ఇప్పుడు ఇలా మీడియాతో మాట్లాడే తీరు చూస్తుంటే మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నిస్తున్నట్టు లేదూ..!