Advertisementt

ఈ ఏడాది ఆ మాస్‌ హీరోకు గ్యాప్‌ వచ్చింది..!

Fri 09th Dec 2016 11:53 AM
hero gopi chand,oxygen movie,dierctor jyothi krishna,a m ratnam,sampath nandi  ఈ ఏడాది ఆ మాస్‌ హీరోకు గ్యాప్‌ వచ్చింది..!
ఈ ఏడాది ఆ మాస్‌ హీరోకు గ్యాప్‌ వచ్చింది..!
Advertisement
Ads by CJ

'లౌక్యం'తో పెద్ద సక్సెస్‌ను అందుకున్న మాస్‌హీరో గోపీచంద్‌ తర్వాతి చిత్రం 'సౌఖ్యం' మాత్రం బాగా నిరాశపరిచింది. దీంతో డీలా పడిన ఈ హీరో ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఎ.యం.రత్నం సారధ్యంలో ఆయన కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో 'ఆక్సిజన్‌' చిత్రం చేస్తున్నాడు. ఈచిత్రం షూటింగ్‌ పార్ట్‌ దాదాపు పూర్తికావచ్చింది. కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లోనే విడుదల చేయాలని భావించారు. కానీ ఆ ప్రయత్నాన్ని ప్రస్తుతం విరమించారు. ఇక ఆయన హీరోగా, బి.గోపాల్‌ దర్శకత్వంలో ఎంతో కాలం కిందట ప్రారంభమైన చిత్రం షూటింగ్‌ చివరి షెడ్యూల్‌లో ఆగిపోయింది. దీంతో ఈ చిత్రాన్ని కూడా పూర్తి చేయనున్నాడు గోపీ. మరోపక్క ఆయన సంపత్‌ నంది వంటి కమర్షియల్‌ డైరెక్టర్‌తో చేస్తున్న చిత్రం షూటింగ్‌ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది ఆయన నటించిన ఒక్క చిత్రం కూడా విడుదల కాలేదు. దీంతో ఆయనతో పాటు ఆయన అభిమానులు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. కానీ ఈ ఏడాది వారిని నిరుత్సాహపరచినప్పటికీ వచ్చే ఏడాది మాత్రం 'ఆక్సిజన్‌', బి.గోపాల్‌ చిత్రం, సంపత్‌ నంది చిత్రాలు మూడు విడుదలయ్యేలా ప్లాన్‌ చేస్తున్నాడు గోపీచంద్‌. మొత్తానికి ఈ హీరో వచ్చే ఏడాది మాత్రం మూడు చిత్రాలతో థియేటర్లలో హంగామా చేయనుండటం ఆయన అబిమానులకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తోందనే చెప్పాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ