Advertisementt

అల్లు అర్జున్ జీవితంలోనే బెస్ట్ సెల్ఫీ..!

Thu 08th Dec 2016 08:41 PM
allu arjun,chiranjeevi,business,nagarjuna,nimmagadda prasad,cricket bengulore blasters team,mahesh babu  అల్లు అర్జున్ జీవితంలోనే బెస్ట్ సెల్ఫీ..!
అల్లు అర్జున్ జీవితంలోనే బెస్ట్ సెల్ఫీ..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ హీరోలు ఒక్క హీరోయిజాన్నే నమ్ముకోకుండా సైడ్ బిజినెస్ ల మీద ఫోకస్ పెట్టారు. క్రేజ్ వున్నంతకాలం మాత్రమే హీరోలుగా కొనసాగే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కేవలం యాక్టింగ్ మీదే కాన్సంట్రేషన్ చెయ్యకుండా మరో పక్క బిజినెస్ పరంగా బాగా బిజీ అవుతున్నారు... నేటి తరం హీరోలు. ఒక్క నేటి తరం హీరోలు మాత్రమే ఇలా ఆలోచించలేదు. ఇప్పటికే సీనియర్ హీరోలైన చిరంజీవి, నాగార్జున పలు వ్యాపార కార్యక్రమాల్లో తలమునకలై వున్నారు. నాగార్జునకి చాలా వ్యాపారాలే వున్నాయి. ఇంకా ఈ హీరోలిద్దరూ మీడియా రంగంలో కూడా తమ పెట్టుబడులు పెట్టారు. 

ఇక ఈ తరం హీరోల్లో రామ్ చరణ్ సినిమాలతో పాటు ఎయిర్ లైన్స్ విమానయాన వ్యాపారంలో కాలుపెట్టాడు. అలాగే మహేష్ యాడ్స్ రంగం లో దూసుకుపోతున్నాడు. మరి అల్లు అర్జునేమో చాలా  రోజుల క్రితం బ్రూయింగ్ క్లబ్ ని హైదరాబాద్ లో  ఓపెన్ చేసాడు. దానిలో మరికొందరు పార్టనర్స్ కూడా వున్నారనుకోండి అది వేరే విషయం. ఇక ఇప్పుడు అల్లు అర్జున్  క్రీడారంగంలో బ్యాడ్మింట్మన్ పై ఇష్టం తో బెంగుళూరు బ్లాస్టర్స్ బ్యాడ్మింటన్ టీమ్ ను తీసుకున్నాడు. ఇప్పటికే నాగార్జున, చిరంజీవి, అల్లు అరవవింద్ లు కేరళ ఫుట్ బాల్ క్లబ్ టీమ్ ని సంయుక్తంగా కొని నడిపిస్తున్నారు. అయితే బన్నీ కొన్న బెంగుళూరు బ్లాస్టర్స్ బ్యాడ్మింటన్ టీమ్ లో చిరు, నాగ్, నిమ్మగడ్డ ప్రసాదులు కూడా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. 

ఇక బెంగుళూరు బ్లాస్టర్స్ బ్యాడ్మింటన్ టీమ్ కు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తాడట. ఈ విషయాన్నీ స్వయం గా అల్లు అర్జున్ ఒక సెల్ఫీతో అభిమానుల తో పంచుకున్నాడు. ఇక ఆ సెల్ఫీ లో అల్లు అర్జున్ తో పాటు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, పుల్లెల గోపీచంద్, చాముండేశ్వరి నాథ్, నిమ్మగడ్డ ప్రసాద్ లు వున్నారు. ఇక ఆ సెల్ఫీకి అల్లు అర్జున్ తన జీవితంలోనే బెస్ట్ సెల్ఫీ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ