Advertisementt

న్యూ ఇయర్ లో మహేష్ హంగామా..!

Thu 08th Dec 2016 12:35 AM
mahesh babu,new year,murugadoss,january,mahesh babu new film  న్యూ ఇయర్ లో మహేష్ హంగామా..!
న్యూ ఇయర్ లో మహేష్ హంగామా..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం దక్షిణాదిలో రూపొందుతున్న చిత్రాలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, దక్షిణాది టాప్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం అనే సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో మహేష్‌ కోలీవుడ్‌లోకి కూడా డైరెక్ట్‌గా ఎంట్రీ ఇస్తుండటం, మహేష్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం కావడం వంటివి ఈ చిత్రంపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కాగా ఇప్పటివరకు ఈ చిత్రం టైటిల్‌తో పాటు ఏ విషయం కూడా బయటకు లీక్‌ కాకుండా దర్శకనిర్మాతలు ఎంతో జాగ్రత్త వహిస్తూ వస్తున్నారు. ఈ చిత్రానికి తమిళ, తెలుగు భాషల్లో ఒకే టైటిల్‌ పెట్టాలని, అది కూడా తమిళనాడులో ఉన్న తమిళ పేరు గల చిత్రాలకు ఉన్న రాయితీలను ఉపయోగించుకునేలా ఆ టైటిల్‌ ఉండాలని మురుగదాస్‌ భావిస్తున్నాడు. అందుకే హీరో క్యారెక్టర్‌ పేరుతో రెండు భాషలకు సెట్‌ అయ్యే టైటిల్‌ కోసం కుస్తీ పడుతున్నాడు. కాగా ఈ చిత్రం టైటిల్‌ను, లోగోను కొత్త ఏడాది కానుకగా జనవరి 1న విడుదల చేయనున్నారని సమాచారం. అదే సమయంలో ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని రిపబ్లిక్‌డే కానుకగా జనవరి 26న తెలుగు, తమిళభాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ