మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్..ప్రఖ్యాత సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చేస్తున్న 'ధృవ' చిత్రం మరో 48 గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించి జరుగుతున్న ప్రమోషన్ కార్యక్రమాలు చూస్తుంటే...సినిమాపై యూనిట్‌కి నమ్మకాలు లేవా అనిపిస్తుంది. దీనికి కారణం బుధవారం ఈ సినిమాకి సంబంధించి హీరో రామ్‌చరణ్ ఇంటర్య్వూ జరగాల్సి ఉంది. కానీ ఉదయం అని చెప్పి ఇప్పటికి 3 సార్లు టైమ్ మార్చారు. మూడోసారి చెప్పిన టైమ్‌కి కూడా రామ్‌చరణ్ రాకపోవడంతో..మీడియా ఒకింత అసహనానికి గురైంది. మరి ప్రెస్(పబ్లిక్) రిలేషన్స్ చూస్తున్న వారికి, నిర్మాతలకి మధ్య కో-ఆర్డినేషన్ లేక జరిగిందో లేక సినిమాపై నమ్మకం లేక..ఇలా జరిగిందో తెలియదు కానీ..ఇటువంటి పరిణామాలు మాత్రం సినిమాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయన్నది మాత్రం నిజం. మూడవ సారి చెప్పిన టైం కంటే చాలా ఆలస్యంగా వచ్చిన చరణ్..అప్పటి వరకు వెయిట్ చేసిన మీడియా గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా.. సినిమా గురించి రెండు మాటలు చెప్పి..హడావుడిగా వెళ్లిపోవడం చూస్తుంటే..సంథింగ్ ఏదో జరుగుతుందనిపిస్తుంది. సినిమా విడుదలకు చాలా తక్కువ టైమ్ ఉంది. ఇలాంటి టైమ్‌లో స్వయంగా హీరోనే సినిమా ప్రమోషన్ విషయంలో ఇలా ప్రవర్తించడం వెనుక అసలు కారణం ఏమై ఉంటుంది? ఇది నిజంగా ప్రెస్(పబ్లిక్) రిలేషన్స్ కార్యక్రమాలు చూస్తున్న వారి తప్పిదమా..! లేక నిర్మాణ సంస్థ కావాలనే రామ్‌చరణ్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేయాలని చూస్తుందా..? అన్నది ఇప్పుడు మెగాభిమానుల మైండ్‌లలో మెదులుతున్న ప్రశ్న.