Advertisementt

ధృవలో పరేషాన్‌ చేస్తున్న హీరోయిన్..!

Wed 07th Dec 2016 09:45 PM
dhruva movie,ram charan,rakul preet singh,paretion song,director surender reddy,dhruva release on 9th december 2016  ధృవలో పరేషాన్‌ చేస్తున్న హీరోయిన్..!
ధృవలో పరేషాన్‌ చేస్తున్న హీరోయిన్..!
Advertisement
Ads by CJ

ఎవరిని ఎలా లొంగదీసుకోవాలో.. ఏ సెంటిమెంట్‌తో కొడితే వారు తన దారికి వస్తారో బాగా తెలిసిన నేటి టాప్‌ హీరోయిన్‌గా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ను చెప్పుకోవచ్చు. కెరీర్‌ మొదట్లో స్టార్స్‌ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన ఈ భామ 'కిక్‌2' నుంచి తన రూట్‌ మార్చింది. తాను నటిస్తున్న టాప్‌హీరోల చిత్రాలు దెబ్బతింటున్నా కూడా వరుసగా స్టార్స్‌ చిత్రాలలో చాన్స్‌లను ఒడిసిపట్టుకుంది. రామ్‌చరణ్‌ సరసన ఆమె నటించిన 'బ్రూస్‌లీ' చిత్రం డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ చరణ్‌ను మాయ చేసిన ఆమె ఆయన తదుపరి చిత్రం 'ధృవ'లో కూడా ఛాన్స్‌ కొట్టేసింది. ఆమె చేసిన చిత్రాలలో 'నాన్నకుప్రేమతో, సరైనోడు' వంటి కొన్ని విజయాలే ఉన్నాయి. మొత్తానికి ఏడాది గ్యాప్‌లోనే ఆమె చరణ్‌ సరసన రెండో సారి నటించిన 'ధృవ' చిత్రం 9వ తేదీన థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. కాగా ఇంతకాలం హీరోయిన్‌గా గ్లామర్‌షో విషయంలో కాస్త హద్దుల్లోనే ఉన్న ఆమె 'ధృవ' చిత్రంలో మాత్రం కేకపుట్టిస్తోంది. ఈ చిత్రం ట్రైలర్‌లో ఆమె చూపిన దూకుడు చూస్తే చలికాలంలో కూడా చెమటలు పట్టేలా ఉన్నాయి. ముఖ్యంగా 'పరేషాన్‌' పాటలో ఆమె గ్లామర్‌షో పీక్స్‌కి వెళ్లింది. హైరేంజ్‌లో అందాల ఆరబోతకు శ్రీకారం చుట్టింది. ఈ పాట క్లిప్పింగ్‌ల్లో ఆమె అందాల ఆరబోతను చూస్తుంటే యువతకు మతులే కాదు.. నిద్ర లేని రాత్రులు కూడా ఖాయం అంటున్నారు. ఈ పాటలో స్క్రీన్‌ మొత్తం తన అందాలను పరిచిన ఈ భామ ఇందులో రామ్‌చరణ్‌ను ఓ గెస్ట్‌లా అదిగమించేసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం ట్రైలరేనని, సినిమా మొత్తం చూస్తేగానీ అసలు విషయం బయటపడదని అంటున్నారు. మొత్తానికి చరణ్‌కు బ్రేక్‌ ఇచ్చేందుకు ఈమె కూడా బాగా హెల్ప్‌ చేసిందనే సెటైర్లు వినిపిస్తున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ