Advertisementt

నాగ్‌కు బాలయ్య అంటే అంత చులకనా..?

Wed 07th Dec 2016 05:41 PM
akkineni nagarjuna,balakrishna,akhil,engagement on 9th dec 2016,chiranjeevi,nagarjuna not invite to balakrishna  నాగ్‌కు బాలయ్య అంటే అంత చులకనా..?
నాగ్‌కు బాలయ్య అంటే అంత చులకనా..?
Advertisement
Ads by CJ

నాగ్‌కు, బాలయ్యకు మద్య విభేదాలు ఇప్పటివి కావనేది వాస్తవం. తాజాగా ఈ విషయం మరోసారి వార్తల్లోకి వచ్చింది. నాగ్‌కు, బాలయ్యకు మధ్య తమ చిత్రాల విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌ విషయంలో బేధాభిప్రాయాలు వచ్చాయని ఇంతకాలం చాలా మంది భావిస్తూ వచ్చారు. ఇంత చిన్న విషయానికి ఇంతపెద్ద గ్యాపా అనే విమర్శలు కూడా వినిపించాయి. 

కాగా నాగ్‌ చిన్నకుమారుడు అఖిల్‌ నిశ్చితార్ధం 9వ తేదీన జరుగనుంది. ఈ ఫంక్షన్‌కు నాగ్‌ కేవలం చిరంజీవి, కేసీఆర్‌, చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు వంటి కొందరినే పిలిచిన సంగతి తెలిసిందే. అయితే చిరంజీవిని చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిగా భావించి పిలిచి ఉంటే ఆయన సమకాలీకుడైన బాలయ్యను కూడా పిలవాలి. అలా కాకుండా ఆయన్ను ఓ రాజకీయనాయకునిగా భావించి పిలిస్తే, హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలయ్యను కూడా పిలవాలి. కానీ నాగ్‌ అలా చేయలేదు. కాగా వీరిద్దరి మధ్య గతం నుంచే విభేదాలున్నాయని అంటున్నారు. నాగార్జున తన తండ్రి ఏయన్నార్‌ 75 ఏళ్ల వసంతోత్సవాలకు చిరు, మోహన్‌బాబు వంటి వారిని పిలిచి బాలయ్యను మాత్రం పిలవలేదంటున్నారు. దాంతో బాలయ్య తన సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడమే కాదు... అక్కినేని గారు మా తండ్రికి స్నేహితులు. ఆయన్ను నేను ఆప్యాయంగా బాబాయ్‌ అని పిలుస్తాను. నాన్నగారు పోయిన తర్వాత ఆయనకు చెప్పకుండా, ఆయనను పిలవకుండా నేను ఏ ఫంక్షన్‌ను చేయలేదు. కానీ నాగ్‌ మాత్రం నన్ను పిలవలేదని అన్నాడని సమాచారం. దీంతో ఈ విషయం నాగ్‌కు కూడా చేరింది. దాంతో ఆయన హడావుడిగా తన తండ్రి ఫంక్షన్‌కు రెండు రోజుల ముందు బాలయ్య ఇంటికి వెళ్లి పిలిచాడంటున్నారు. కానీ బాలయ్య మాత్రం నాకు వీలుకాదు... నేను బిజీగా ఉన్నానంటూ నాగ్‌కు మొహం మీదనే చెప్పేశాడట. ఇక తన 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం వేడుకకు చిరుని కూడా పిలిచిన బాలయ్య నాగ్‌పై కోపంతో నన్ను గౌరవించని  వారిని నేనేందుకు పిలవాలి.. అని భావించి నాగ్‌ను పిలవలేదట. ఇక 'అఖిల్‌' డిజాస్టర్‌ తర్వాత బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీపై మాట్లాడుతూ, తాము ఓ మంచి ప్రేమకథ కోసం ఎదురుచూస్తున్నామని, మొదటి చిత్రంతోనే ప్రపంచాన్ని రక్షించేంత క్యారెక్టర్‌ కోసం కాదంటూ నాగ్‌ను, అఖిల్‌ను దెప్పిపొడిచిన సంగతి తెలిసిందే. తాజాగా అఖిల్‌ నిశ్చితార్దానికి అటు సినీ నటునిగా లేదా రాజకీయ నాయకునిగా భావించి బాలయ్యను పిలవకుండా కేవలం చిరునే పిలిచాడని అంటున్నారు. చిరు నాగ్‌కు కొన్ని వ్యాపారాల్లో భాగస్వామి కావడం వల్లనే అలా పిలిచాడని, నాగ్‌ ప్రతి ఒక్కటి బిజినెస్‌గానే భావిస్తాడనే విమర్శలు ఇప్పుడు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ